Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆస్కార్ అకాడమీ కొత్త సభ్యుల జాబితాలో బాలీవుడ్ భామలు

Webdunia
శుక్రవారం, 2 జులై 2021 (17:27 IST)
ప్ర‌తిష్టాత్మ‌క ఆస్కార్ అకాడ‌మీ కొత్త స‌భ్యుల వివ‌రాల‌ను తాజాగా వెల్ల‌డించింది. ఈ జాబితాలో భారతీయ చిత్ర పరిశ్రమకు చెందిన ఇద్దరు భామలకు చోటు దక్కింది. ఇందులో బాలీవుడ్ న‌టి విద్యా బాల‌న్‌తో పాటు టీవీ నిర్మాత ఏక్తా కపూర్‌, ఆమె త‌ల్లి శోభా క‌పూర్‌లో ఈ ఏడాది రిలీజ్ చేసిన ఆస్కార్ కొత్త క‌మిటీలో స‌భ్యులుగా ఉన్నారు. 
 
మొత్తం 50 దేశాల‌కు చెందిన 395 మంది స‌భ్యుల‌తో జాబితాను ఆస్కార్ అకాడ‌మీ రిలీజ్ చేసింది. 'ద క్లాస్ ఆఫ్ 2021' పేరుతో రిలీజ్ చేసిన లిస్టులో 46 శాతం మంది మ‌హిళ‌లు ఉండటం గమనార్హం. 
 
'మిస్ట‌రీ థ్రిల్ల‌ర్ క‌హానీ', 'ఫ్యామిలీ డ్రామా తుమ్‌హ‌రి సులు' లాంటి చిత్రాల్లో విద్యాబాల‌న్ న‌టించి ప్ర‌శంస‌లు పొందారు. 2011లో వ‌చ్చిన "ద డ‌ర్టీ పిక్చ‌ర్" సినిమాలో ప్ర‌ధాన పాత్ర పోషించిన విద్యాబాల‌న్‌కు జాతీయ ఫిల్మ్ అవార్డు ద‌క్కిన విష‌యం తెలిసిందే.
 
ఇకపోతే, బాలాజీ టెలి ఫిల్మ్స్‌కు చెందిన ప్రొడ్యూస‌ర్లు ఏక్తా క‌పూర్‌, శోభా క‌పూర్‌లు కూడా ఆస్కార్ అకాడ‌మీలో కొత్త స‌భ్యుల‌య్యారు. 'డ్రీమ్ గ‌ర్ల్‌', 'వ‌న్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ ముంబై', 'ఉడ్తా పంజాబ్'‌, 'డ‌ర్టీ పిక్చ‌ర్' లాంటి సినిమాల‌కు వీళ్లు నిర్మాత‌లుగా చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పలుచోట్ల 42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు

నా భార్యను ఆమె ప్రియుడికిచ్చి ఎందుకు పెళ్లి చేశానంటే... వివరించిన భర్త (Video)

నా కూతురినే ప్రేమిస్తావా? చావు: గొడ్డలితో నరికి చంపిన వ్యక్తి

అందాల పోటీలు నిలిపివేసి.. అమ్మాయిలకు స్కూటీలు ఇవ్వాలన్న కేటీఆర్!!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments