Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ మామ‌కు ఇంకేం కావాలి-వెంక‌టేష్

Webdunia
సోమవారం, 9 డిశెంబరు 2019 (11:32 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో రూపొందిన భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ‌తో క‌లిసి ఈ సినిమాని నిర్మించింది. 
 
డిసెంబ‌ర్ 13న విక్ట‌రీ వెంక‌టేష్ పుట్టిన‌రో జు కానుక‌గా ఈ సినిమాని భారీ స్ధాయిలో రిలీజ్ చేస్తున్నారు.
 
ఈ సినిమా గురించి వెంక‌టేష్ స్పందిస్తూ... ఈ సినిమాలో చైతూకు మాత్రమే నేను మామ.. కానీ విడుదల తర్వాత అందరికీ వెంకీ మామనే. 
 
ఎక్కడికి వెళ్లినా కూడా వెంకీమామ అంటున్నారు. మా సురేష్ ప్రొడక్షన్స్‌లో చైతూ తొలిసారి చేస్తున్నాడు. ఈ సినిమాలో చైతూ యాక్టింగ్ చించేసాడు. నాకు చాలా గర్వంగా ఉంది. ఈ మామకు ఇంకేం కావాలి చెప్పండి. ముందు నుంచే ఈ సినిమా బాగా వచ్చింది. 
 
మంచి కథ తెచ్చుకున్నాం. అందరం కష్టపడి సూపర్ హిట్ చేస్తున్నామని కష్టపడి పని చేసాం.
 
టెక్నీషియన్స్ అంతా కష్టపడ్డారు. థమన్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. ముఖ్యంగా దర్శకుడు బాబీ ఈ సినిమాను అద్భుతంగా తీసి మామ అల్లుడు సెంటిమెంట్ టెర్రిఫిక్‌గా తీశాడు. 
 
చాలా థ్యాంక్స్ బాబీ.. అద్భుతమైన సినిమా ఇచ్చావు. ఈ సినిమాలో అమ్మైనా నాన్నైనా నువ్వేలే నువ్వే వెంకీ మామ అనే పాట ఉంది. నాకు అంతా ఫ్యాన్సే.  నా 30 ఏళ్ల కెరీర్‌లో అభిమానులే నా బలం. డిసెంబ‌ర్ 13న థియేట‌ర్స్ లో క‌లుద్దాం అని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan Letter: డీలిమిటేషన్ ప్రక్రియతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం.. మోదీకి జగన్ లేఖ

రాజకీయ అధికారం తాత్కాలికమే.. ఎన్నికల కాలానికే పరిమితం.. జగన్ అర్థం చేసుకోవాలి?

పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేసిన గుంటూరు కోర్టు

Navy Officer Murder Case: వెలుగులోకి షాకింగ్ నిజాలు.. మృతదేహంపైనే నిద్ర..

అమరావతిలో అతిపెద్ద అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం... కేశినేని శివనాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments