Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ75 జనవరి 25న అనౌన్స్ మెంట్

Webdunia
సోమవారం, 23 జనవరి 2023 (13:25 IST)
Venky75 Pre Look
‘’ఎఫ్3’’ బ్లాక్‌బస్టర్ విజయంతో దూసుకుపోతున్న విక్టరీ వెంకటేష్, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పై వెంకట్ బోయనపల్లి నిర్మించనున్న హై-బడ్జెట్ చిత్రం కోసం ‘HIT’ ఫ్రాంచైజ్ తో వరుస విజయాల్ని అందించిన టాలెంటెడ్ డైరెక్టర్ శైలేశ్ కొల‌ను తో చేతులు కలపనున్నారు.
 
వెంకటేష్ ల్యాండ్‌మార్క్ 75వ చిత్రం- #వెంకీ75, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ నుంచి ప్రొడక్షన్ నెం 2 గా రాబోతుంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ ‘శ్యామ్ సింగరాయ్’ తో నిర్మాణంలో విజయవంతంగా అడుగుపెట్టింది. ప్రొడక్షన్ హౌస్  ఈ అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని భారీ స్థాయిలో రూపొందించనుంది. వెంకటేష్‌కి ఇది అత్యంత భారీ బడ్జెట్ సినిమా కానుంది.
 
సక్సెస్ ఫుల్ పీపుల్ నుంచి వస్తున్న ఈ సినిమాపై సహజంగానే భారీ అంచనాలు వున్నాయి. ప్రీ లుక్ పోస్టర్‌లో వెంకటేష్ చేతిలో ఏదో పట్టుకున్న సిల్హౌట్ ఇమేజ్ కనిపిస్తుంది. అది గన్ కాదు.. మరి అదేంటో అనే విషయం ఈ నెల 25న తెలుస్తుంది. భారీ పేలుడు, దట్టమైన పొగతో కూడిన ప్రీ-లుక్ పోస్టర్ వెంకటేష్ ఇంటెన్స్ రోల్, సినిమా యాక్షన్ జానర్‌ను సూచిస్తుంది.
 
విన్నంగ్ స్క్రిప్ట్‌ను రాసిన శైలేశ్ కొల‌ను, వెంకటేష్ ను మునుపెన్నడూ చూడని సరికొత్త పాత్రలో ప్రజంట్ చేయనున్నారు. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు. ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో మేకర్స్ అనౌన్స్ చేస్తారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Midhun Reddy: మిధున్ రెడ్డిని పట్టించుకోని వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి?

Nara Lokesh: కర్ణాటకపై నారా లోకేష్ దూకుడు విధానం.. ఈ పోటీ రాష్ట్రాలకు మేలు చేస్తుందిగా?

పూజ చేస్తూ కుప్పకూలిపోయిన పూజారి.. అంబులెన్స్ దొరకలేదు.. వైద్యులు లేరు..?

Janasena: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిర్మాత రామ్ తాళ్లూరి

Tomato virus: మధ్యప్రదేశ్‌లో విజృంభించిన టమోటా వైరస్.. చిన్నారులు జాగ్రత్త

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments