Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ మామకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న పాయల్ రాజ్...

Webdunia
మంగళవారం, 3 సెప్టెంబరు 2019 (19:23 IST)
విక్టరీ వెంకటేష్ - యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్లో రూపొందుతోన్న భారీ మ‌ల్టీస్టార‌ర్ వెంకీ మామ‌. ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. వినాయక చవితి పర్వదినం సందర్భంగా 'వెంకీమామ' టీమ్ ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ కొత్త పోస్టర్ విడుదల చేశారు.
 
పండగ సందర్భానికి తగ్గట్టే ఈ పోస్టర్ కలర్ఫుల్‌గా బ్రైట్‌గా ఉంది. వెంకీ.. చైతు ఇద్దరూ అచ్చమైన తెలుగింటి సంప్రదాయంలో పంచెకట్టులో మెడలో కండువా వేసుకొని కనిపించారు. కాళ్ళకు తోలు చెప్పులు.. కళ్ళకు చలువ కళ్ళజోడు ధరించి ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని చలాకీగా నవ్వుతూ నడిచి వస్తున్నారు.ఈ పోస్టర్ చూస్తుంటేనే దగ్గుబాటి మామ అక్కినేని అల్లుడు కలిసి బాక్సాఫీసును షేక్ చేయడానికి వస్తున్నట్టుగా ఉంది. 
 
ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి ఈ పోస్ట‌ర్ మ‌రింత ఆస‌క్తిని క‌లిగించింది అన‌డంతో ఎలాంటి సందేహం లేదు. ఐతే వెంకీ సరసన నటిస్తున్న పాయల్ రాజ్ మాత్రం వెంకీ కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. వరుసబెట్టి అడల్ట్ చిత్రాల్లో నటిస్తూ క్లీవేజ్ షో చేస్తూ బెదరగొడుతోందట. ఇలాంటి ఇమేజ్ చంకనెత్తుకుని వెంకీమామతో వస్తే జనం ఎలా రిసీవ్ చేసుకుంటారోనని వెంకీ మామ బెంబేలెత్తిపోతున్నాడట. మ‌రి... వెంకీ - చైతు బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి సెన్సేష‌న్ క్రియేట్ చేస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లిఫ్ట్‌ పేరుతో నమ్మించి... జర్మనీ యువతిపై అత్యాచారం

భారత్ కంటే పాకిస్తాన్ సేఫ్ ప్లేసా? యోవ్, ఏందయ్యా ఇదీ?!!

తెలంగాణ టీడీపీ చీఫ్‌గా నందమూరి సుహాసిని.. చంద్రబాబు ప్లాన్ ఏంటి..?

చెప్పపెట్టకుండా బయటకు ఎందుకు వెళ్లారే దొంగముండల్లారా... లేడీ ప్రిన్సిపాల్ బూతులు (Video)

నోబెల్ శాంతి బహుమతి కోసం ఇమ్రాన్ ఖాన్ పేరు నామినేట్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments