Webdunia - Bharat's app for daily news and videos

Install App

మై నాగా నాయుడు అంటూ సరికొత్త ప్రమోషన్‌తో వెంకటేష్‌

Webdunia
సోమవారం, 13 ఫిబ్రవరి 2023 (16:47 IST)
Venkatesh
విక్టరీ వెంకటేష్‌ తాజాగా నెట్‌ఫ్లిక్స్‌కు చేస్తున్న సినిమా రానా నాయుడు. దీనికి ముందు సైంథవ్‌ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ జరుగుతోంది. అయితే మొట్టమొదటి వెబ్‌ సినిమాగా రానా నాయుడు చేస్తున్నాడు. ఇందుకోసం పూర్తిగా తెల్లటి గడ్డంతో గతంలోనే స్టిల్‌ను బయటకు వదిలారు. ఓటీటీలో ఈ సినిమా గురించి అప్‌డేట్‌ అడుగుతున్నారు. 
 
అందుకే ఈరోజు వెంకటేష్‌ తన సోషల్‌ మీడియాలో చిన్న వీడియో విడుదల చేశారు. .. బిగ్‌ మిస్టేక్‌ నై కర్నా నెట్‌ఫ్లిక్స్‌, ఇస్‌మే హీరో కౌన్‌? మై. స్టార్‌ కౌన్‌.. మై.. అంటూ తన ఫోన్‌తో వెంకటేష్‌ చిన్న క్లిప్‌ చేసి విడుదల చేశారు. ఈ వెబ్‌ సిరీస్‌ను ప్రమోషన్‌లో భాగంగా ఫనీగా తీసినట్లుంది. కరణ్‌ అన్హుమాన్‌, సువర్ణ్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. రానా మరో కీలక పాత్ర పోషించారు. లోకోమోటివ్‌ గ్లోబల్‌ మీడియా ఎల్‌.ఎల్‌.పి.కి చెందిన సుందర్‌ ఆరోన్‌ హిందీ సిరీస్‌ను నిర్మించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments