మరో రీమేక్ చేయబోతున్న వెంకీ మామ??

Webdunia
మంగళవారం, 4 జూన్ 2019 (14:35 IST)
సంక్రాంతికి విడుదలైన 'ఎఫ్‌2' సినిమాతో ఈ ఏడాదిని సక్సెస్‌ఫుల్‌గా ప్రారంభించిన సీనియ‌ర్ హీరో వెంక‌టేష్ ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్నారు. 'గురు' సినిమా చేసిన త‌ర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న విక్టరీ వెంక‌టేష్ స‌రైన స్క్రిప్ట్‌ని ఎంచుకుని, దానికి త‌నదైన అద్భుత‌మైన కామెడీ టైమింగ్‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఉర్రూత‌లూగించారనడంలో ఎటువంటి సందేహం లేదు. కాగా... ఆయన ప్ర‌స్తుతం తన మేన‌ల్లుడు నాగ‌చైతన్య‌తో క‌లిసి 'వెంకీ మామ' సినిమా చేస్తున్నారు.
 
కాగా... ఈ సినిమా త‌ర్వాత వెంకీ తన పాత పంథాలోనే ఓ హిందీ సినిమాని రీమేక్ చేయాల‌నే ఆలోచ‌న‌లో ఉన్న‌ారట. ఈ మేరకు అజ‌య్‌దేవ‌గ‌ణ్ హీరోగా నటించి, ఇటీవల విడుదలైన 'దే దే ప్యార్ దే' సినిమాలోని అజ‌య్‌దేవ‌గ‌ణ్ పాత్ర వెంకీకి చాలా న‌చ్చింద‌ట‌. విడాకులు తీసుకున్న 50 ఏళ్ల హీరో త‌న వ‌య‌సులో సగం వ‌యసు ఉన్న అమ్మాయితో ప్రేమ‌లో ప‌డే ఆ క్యారెక్ట‌ర్ త‌న‌కు స‌రిగ్గా స‌రిపోతుందని వెంకీ భావిస్తున్నట్లు సమాచారం‌. మరి వెంకీ ఈ సినిమాని ఏ రేంజ్‌లో చేయబోతున్నారో... చూడాల్సిందే... 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మోసం చేసిన ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ఇన్ఫోసిస్ టెక్కీ

జార్ఖండ్‌లో ఘోరం.. భార్య మద్యం సేవించి వచ్చిందని భర్త దాడి.. తీవ్రగాయాలతో మృతి

ప్రియురాలిని చంపి సూట్‌కేసులో కుక్కి... కాలువలో పడేశాడు...

Mock Assembly in Amaravati: విద్యార్థులతో మాక్ అసెంబ్లీ.. హాజరైన చంద్రబాబు, నారా లోకేష్ (video)

అర్థరాత్రి రాపిడో బ్రేక్ డౌన్... యువతి కంగారు... ఆ కెప్టెన్ ఏం చేశారంటే....

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

తర్వాతి కథనం
Show comments