Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ 75వ సినిమా- త్రివిక్ర‌మ్ దర్శకత్వంలో...

విక్ట‌రీ వెంక‌టేష్ గురు సినిమాతో విజ‌యం సాధించిన త‌ర్వాత త‌దుప‌రి సినిమా చేయ‌డం కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేసాడు. కానీ.. వ‌ర్క‌వుట్ కాలేదు. పూరి జ‌గ‌న్నాథ్, క్రిష్‌, కిషోర్ తిరుమ‌ల‌, తేజ‌.. ఇలా చాలామంది ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయాలి అనుకున్నారు కానీ.. ఇవ

Webdunia
సోమవారం, 4 జూన్ 2018 (17:54 IST)
విక్ట‌రీ వెంక‌టేష్ గురు సినిమాతో విజ‌యం సాధించిన త‌ర్వాత త‌దుప‌రి సినిమా చేయ‌డం కోసం చాలా ప్ర‌య‌త్నాలు చేసాడు. కానీ.. వ‌ర్క‌వుట్ కాలేదు. పూరి జ‌గ‌న్నాథ్, క్రిష్‌, కిషోర్ తిరుమ‌ల‌, తేజ‌.. ఇలా చాలామంది ద‌ర్శ‌కుల‌తో సినిమాలు చేయాలి అనుకున్నారు కానీ.. ఇవేవీ కూడా సెట్స్ పైకి వెళ్ల‌కుండానే ఆగిపోయాయి. ఇదిలా ఉంటే... వెంకీ రెండు మ‌ల్టీస్టార‌ర్స్‌కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇందులో ఒక‌టి అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో కాగా, రెండోది బాబీ ద‌ర్శ‌క‌త్వంలో.
 
ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... వెంకీ మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో సినిమా చేయ‌నున్నాడు అని గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వ‌స్తున్నాయి. కానీ.. క్లారిటీ లేదు. ఇక ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ వార్త బ‌య‌ట‌కు వ‌చ్చింది. అది ఏంటంటే... వెంకీ త‌న 75వ చిత్రాన్ని త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌తో చేయ‌నున్నార‌ట‌. ఈ సినిమాని హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ నిర్మించ‌నున్నారు. అయితే.. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నారు. 
 
ఈ సినిమా ద‌స‌రా కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా పూర్తైన త‌ర్వాత వెంకీతో సినిమా ప్రారంభిస్తార‌ట‌. ఈ చిత్రాన్ని వెంకీ పుట్టిన‌రోజునాడు అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసి.. రెగ్యుల‌ర్ షూటింగ్‌ను జ‌న‌వ‌రి నుంచి ప్రారంభించ‌నున్నార‌ని స‌మాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కుటుంబ వివాదాలు.. భర్తను హత్య చేసి ఇంటి ఆవరణలో పాతిపెట్టిన భార్య!

అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి అదే కారణమా?

భర్త అక్రమ సంబంధం.. దంత మహిళా వైద్యురాలు ఆత్మహత్య ... ఎక్కడ?

పేర్ని నానీ నీకంత కొవ్వు పట్టిందా? వల్లభేని వంశీని గుర్తు చేసుకో : సోమిరెడ్డి

సమోసా జిలేబీలపై చక్కెర, నూనె ఎంతుందో హెచ్చరించాలి.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments