Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకీ - చైతుల ''వెంకీ మామ'' ప్రారంభం..!

విక్ట‌రీ వెంక‌టేష్, యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చైత‌న్య‌తో సినిమా తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇన్నాళ్ల‌కు అది కుదిరింది. ఇక ఈ సెన్సేష‌న‌ల్ మ‌ల్టీస్

Webdunia
గురువారం, 12 జులై 2018 (19:43 IST)
విక్ట‌రీ వెంక‌టేష్, యువ స‌మ్రాట్ నాగ చైత‌న్య కాంబినేష‌న్‌లో భారీ మ‌ల్టీస్టార‌ర్ కోసం అభిమానులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్నారు. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ చైత‌న్య‌తో సినిమా తీయాల‌ని ప్ర‌య‌త్నిస్తుంది. ఇన్నాళ్ల‌కు అది కుదిరింది. ఇక ఈ సెన్సేష‌న‌ల్ మ‌ల్టీస్టార‌ర్ రామానాయుడు స్టూడియోలో సినీ, రాజ‌కీయ నాయ‌కుల‌ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. సురేష్ ప్రొడ‌క్ష‌న్స్, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. జై ల‌వ‌కుశ ఫేమ్ బాబీ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.
 
వెంక‌టేష్ - నాగ చైత‌న్యలపై చిత్రీక‌రించిన ముహుర్త‌పు స‌న్నివేశానికి డైన‌మిక్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్ క్లాప్ ఇవ్వ‌గా సురేష్ బాబు స్విచ్చాన్ చేసారు. ఈ చిత్రంలో నాగ చైత‌న్య స‌ర‌స‌న ర‌కుల్ ప్రీత్ సింగ్ న‌టిస్తుండ‌గా, వెంకీ స‌ర‌స‌న న‌టించే హీరోయిన్‌ని ఎంపిక చేయాల్సివుంది. గ్రామీణ నేప‌ధ్యంతో సాగే ఈ చిత్రానికి జ‌నార్థ‌న మ‌హ‌ర్షి క‌థ అందించారు. ఇక రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే నెల నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్స‌వంలో సురేష్ బాబు, ద‌గ్గుబాటి రానా, పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ అధినేత టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, నిర్మాత వివేక్ కూచిభ‌ట్ల‌, కోన వెంక‌ట్, డైరెక్ట‌ర్ బాబీ, మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments