Webdunia - Bharat's app for daily news and videos

Install App

వెంకటేష్ మాటే మా వీక్షణం సినిమాకు కథా నేపథ్యం : దర్శకుడు మనోజ్ పల్లేటి

డీవీ
గురువారం, 3 అక్టోబరు 2024 (17:06 IST)
Veekshanam team with tamaareddy
రామ్ కార్తీక్, క‌శ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "వీక్షణం".  ఈ చిత్రాన్ని ప‌ద్మ‌నాభ సినీ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మ‌నోజ్ ప‌ల్లేటి రూపొందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న "వీక్షణం" సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. 
 
మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ -  మీరు టీజర్ లో చూసింది కొంతే. ఈ నెల 18న థియేటర్స్ లో మా మూవీని ఎంజాయ్ చేస్తారు. ఈ చిత్రంలో మంచి మ్యూజిక్ చేసే అవకాశం డైరెక్టర్ మనోజ్ గారు ఇచ్చారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నా. అన్నారు.
 
నిర్మాత పి.పద్మనాభ రెడ్డి మాట్లాడుతూ - మా వీక్షణం సినిమా టీజర్ లాంఛ్ కు వచ్చిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి కృతజ్ఞతలు. టీజర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ఈనెల 18న థియేటర్స్ లోకి వస్తున్న మూవీని కూడా ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ గా వీక్షణం సినిమా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
 
నిర్మాత అశోక్ రెడ్డి మాట్లాడుతూ - వీక్షణం సినిమా టీజర్ లాంఛ్ చేసిన తమ్మారెడ్డి భరద్వాజ గారికి కృతజ్ఞతలు. మా మూవీ టీజర్ మీకు బాగా నచ్చిందని తెలుస్తోంది. ఎక్కడా ల్యాగ్ లేకుండా మిమ్మల్ని ఎంగేజ్  చేసే చిత్రమిది. ఫన్, లవ్, సస్పెన్స్, మిస్టరీ వంటి అన్ని ఎలిమెంట్స్ మా సినిమాలో ఆకట్టుకుంటాయి. అన్నారు.
 
హీరోయిన్ కశ్వి మాట్లాడుతూ - ఈ రోజు మా ఈవెంట్ కు వచ్చి మీ విలువైన సమయం వెచ్చించిన ప్రతి ఒక్కరికీ మా టీమ్ తరుపున థ్యాంక్స్ చెబుతున్నా. నాకు ఈ చిత్రంలో నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి, డైరెక్టర్ మనోజ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. ఒక మంచి మిస్టరీ కామెడీ థ్రిల్లర్ మూవీ చూడాలనుకునే ప్రేక్షకులు మా వీక్షణం సినిమాకు వచ్చేయండి. మీరు తప్పకుండా ఎంటర్ టైన్ అవుతారు. ఈ నెల 18న థియేటర్స్ లో కలుద్దాం. అన్నారు.
 
దర్శకుడు మనోజ్ పల్లేటి మాట్లాడుతూ - నేను రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో కోర్స్ చేశాను. ఒకరోజు విక్టరీ వెంకటేష్ ఒక మాట చెప్పారు. ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏంటంటే మన పని మనం చూసుకోవడం. ఆయన చెప్పిన ఆ మాటే మా వీక్షణం సినిమాకు కథా నేపథ్యం. మా చిత్రంలో హీరో ఎప్పుడూ పక్కోడి లైఫ్ లో ఏం జరుగుతుందో చూడాలనే ఉత్సాహంలో ఉంటాడు. ఆ ఉత్సాహం వల్ల అతనికి జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి అనేది సినిమాలో ఆసక్తికరంగా చూపిస్తున్నాం. మా టీమ్ అంతా కష్టపడి కాకుండా ఇష్టపడి మూవీ కోసం వర్క్ చేశాం. ఈ రోజు మమ్మల్ని బ్లెస్ చేసేందుకు వచ్చిన భరద్వాజ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ నెల 18న థియేటర్స్ లో మా మూవీ చూసి సపోర్ట్ చేయండి. టీజర్ లాంఛ్ రోజే చెబుతున్నా, మేము తప్పకుండా సక్సెస్ మీట్ నిర్వహిస్తాం. ఆ రోజు మళ్లీ మీ అందరినీ కలుస్తాము. అన్నారు.
 
అతిథిగా వచ్చిన దర్శక నిర్మాత తమ్మారెడ్డి మాట్లాడుతూ - వీక్షణం సినిమా టీజర్ బాగుంది. సినిమాలో మంచి కంటెంట్ ఉన్నట్ల టీజర్ తో తెలుస్తోంది. ఆదిత్య మ్యూజిక్ వాళ్లు హిట్ సినిమాలను మాత్రమే మ్యూజిక్ రిలీజ్ చేస్తున్నారు. వీక్షణం సినిమా వాళ్లు తీసుకున్నారంటే హిట్ అయినట్లే. హీరో రామ్ కార్తీక్, కశ్వి జంట తెరపై బాగుంది. దర్శకుడు మనోజ్ పల్లేటితో పాటు టీమ్ అందరికీ సినిమా సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
హీరో రామ్ కార్తీక్ మాట్లాడుతూ, చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మంచి మూవీకి తన సపోర్ట్ అందిస్తారు తమ్మారెడ్డి భరద్వాజ గారు. ఆయన మా టీజర్ లాంఛ్ కు రావడం సంతోషంగా ఉంది. వీక్షణం సినిమా ప్రేక్షకులతో పాటు చిత్ర పరిశ్రమలోనూ మా అందరికీ మంచి గుర్తింపు తెస్తుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాకు డీవోపీ సాయి, డైరెక్టర్ మనోజ్ రెండు కళ్లలాంటి వారు. ఇలాంటి బ్యూటిఫుల్ స్క్రిప్ట్ ఇచ్చినందుకు డైరెక్టర్ మనోజ్ కు థ్యాంక్స్ చెబుతున్నా. మా మూవీ నుంచి ఇప్పటిదాకా రిలీజ్ చేసిన రెండు పాటలకు రెస్పాన్స్ బాగుంది. టీజర్ కూడా మీ అందరి ఆదరణ పొందుతోంది. ఈ నెల 18న సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాం. అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

24న డాక్టర్ గౌరీ లక్ష్మీబాయికి ఆధ్యాత్మిక పురస్కారం ప్రదానం

జగన్ 'గులక రాయి' డ్రామా.. వైకాపా గాలి తీసిన సీఎం చంద్రబాబు

పండమేరు వంతెన నిర్మాణానికి నిధులు ఇవ్వండి.. పవన్‌కు పరిటాల సునీత వినతి

కేన్సర్ 40 రోజుల్లో తగ్గిపోయిందన్న నవజ్యోత్ సింగ్ సిద్ధు, నెటిజన్లు ఏమంటున్నారు?

పెద్దిరెడ్డి పక్కకుపోతే.. పవన్‌తో చేతులు కలిపిన బొత్స -వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments