Webdunia - Bharat's app for daily news and videos

Install App

'వీరసింహారెడ్డి' ప్రీరిలీజ్‌కు అనుమతి నిరాకరణ.. మారిన వేదిక

Webdunia
గురువారం, 5 జనవరి 2023 (17:23 IST)
హీరో బాలకృష్ణ నటించిన కొత్త చిత్రం "వీరసింహారెడ్డి". సంక్రాంతికి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన విడుదలకానుంది. దీన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీ శుక్రవారం ప్రీరిలీజ్ వేడుకను అట్టహాసంగా నిర్వహించాలని చిత్ర నిర్మాతలు భావించారు. ఇందులోభాగంగా తొలుత ఒంగోలులోని ఏబీఎం కాలేజీ మైదానంలో నిర్వహించుకునేందుకు పోలీసులు అనుమతి ఇచ్చారు. 
 
కానీ, సీఎం జగన్ సారథ్యంలోని వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని సాకుగా చూపి అక్కడ అనుమతి రద్దు చేశారు. దీంతో నిర్మాతలు మరో వేదికను ఎంపిక చేశారు. ఒంగోలు మార్కెట్ యార్డు ఎదురుగా ఉన్న అర్జున్ ఇన్ఫ్రా గ్రౌండ్‌‌లో ఈ వేడుకలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. 
 
ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ అందుకు సంబంధించిన పోస్టరును రిలీజ్ చేశారు. ఒంగోలులోని ఈ ప్రదేశఁలో ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటలకు నుంచి ఈ వేడుక మొదలుకానుంది. కాగా, ఈ చిత్రంలో శృతిహాసన్ హీరోయిన్. దునియా విజయ్ ప్రతినాయకుడిగా నటించారు. థమన్ సంగీతం సమకూర్చిన ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానరుపై భారీ బడ్జెట్‌తో నిర్మించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేపాల్‌లో బద్ధలవుతున్న జైళ్లు.. పారిపోతున్న ఖైదీలు

బైడెన్ అహంకారం వల్లే ఓడిపోయాం : కమలా హారిస్

చంపెయ్... గొంతు పిసికి చంపేసెయ్... మనం ప్రశాంతంగా ఉండొచ్చు... ప్రియుడుని ఉసికొల్పిన భార్య

ప్రియుడితో భార్యను చూసి కుప్పకూలిన భర్త, కాళ్లపై పడి భార్య కన్నీటి పర్యంతం

భారత్‌లో దాడులకు కుట్ర... పాక్ దౌత్యవేత్తకు ఎన్.ఐ.ఏ సమన్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

టొమాటో సూప్ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

మీరు మద్యం సేవిస్తున్నారా? అయితే, ఈ ఫుడ్ తీసుకోవద్దు

పచ్చి ఉల్లిపాయలు తినడం వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి?

బీపీ వున్నవారు ఏమేమి తినకుండా వుండాలి?

తర్వాతి కథనం
Show comments