Webdunia - Bharat's app for daily news and videos

Install App

వేదిక, మంచు లక్ష్మి లతో సోషియో ఫాంటసీ వెబ్ సిరీస్ యక్షిణి చేసున్న హాట్ స్టార్

డీవీ
బుధవారం, 22 మే 2024 (13:16 IST)
Yakshini poster
ఆర్కా మీడియా వర్క్స్, డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ ది సూపర్ హిట్ కాంబినేషన్. ఈ సంస్థలు కలిసి చేసిన పరంపర, పరంపర 2 వెబ్ సిరీస్ లు ప్రేక్షకుల్ని ఆకట్టుకుని విజయం సాధించాయి. ఇప్పుడు ఇదే కాంబోలో "యక్షిణి" అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్. "యక్షిణి" వెబ్ సిరీస్ ను శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మిస్తున్నారు.
 
వేదిక, మంచు లక్ష్మి, రాహుల్ విజయ్, అజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అర్జున ఫాల్గుణ, జోహార్, కోట బొమ్మాళి పీఎస్ వంటి సినిమాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న తేజ మార్ని "యక్షిణి" సిరీస్ ను రూపొందిస్తున్నారు. కృష్ణ, మాయ పాత్రలతో సోషియా ఫాంటసీ నేపథ్యాన్ని ఈ సిరీస్ కు ఎంచుకున్నారు దర్శకుడు తేజ మార్ని.
 
ఫాంటసీ, రొమాన్స్, కామెడీ అంశాలతో రూపొందిన "యక్షిణి" ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది. డైరెక్టర్ తేజ మార్ని విజన్ కు తగినట్లు భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో ఆర్కా మీడియా వర్క్స్ ఈ సిరీస్ ను నిర్మించింది. జూన్ లో తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీలో "యక్షిణి" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కు రాబోతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేస్తే అత్యున్నత పదవులు వరిస్తాయా? నాడు ముర్ము - నేడు సీపీఆర్

కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి - విద్యుత్ షాక్‌తో ఐదుగురి మృతి

కుమార్తె అప్పగింత వేళ ఆగిన గుండె... పెళ్లింట విషాదం!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments