Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్ర‌మోహ‌న్‌, క‌విత‌ల‌కు బుల్లితెర పుర‌స్కారాలు

అల‌నాటి మేటి క‌థానాయ‌కుడు, సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్, నాటి మేటి హీరోయిన్‌, న‌టి క‌విత బుల్లితెర‌పై ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు అందుకున్నారు. విబి (విష్ణు బొప్ప‌న‌) ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ -2016 పుర‌స్కా

Webdunia
శుక్రవారం, 25 నవంబరు 2016 (14:17 IST)
అల‌నాటి మేటి క‌థానాయ‌కుడు, సీనియ‌ర్ న‌టుడు చంద్ర‌మోహ‌న్, నాటి మేటి హీరోయిన్‌, న‌టి క‌విత బుల్లితెర‌పై ప్ర‌తిష్టాత్మ‌క అవార్డులు అందుకున్నారు. విబి (విష్ణు బొప్ప‌న‌) ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ -2016  పుర‌స్కారాల్లో లెజెండ‌రీ అవార్డును చంద్ర‌మోహ‌న్‌, జీవ‌న సాఫ‌ల్య పుర‌స్కారాన్ని న‌టి శ్రీ‌మ‌తి క‌వితల‌కు ప్ర‌క‌టించారు. 
 
ప్ర‌భాక‌ర్ ఆల్‌రౌండ‌ర్ పుర‌స్కారాన్ని అందుకోనున్నారు. ఈ పుర‌స్కారాల్ని డిసెంబ‌ర్ 4న అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో జ‌రిగే ఓ ప్ర‌ైవేటు కార్య‌క్ర‌మంలో వారికి ప్రదానం చేస్తామని అవార్డు క‌ర్త‌లు విష్ణు బొప్ప‌న తెలియ‌జేశారు. వెండితెర, బుల్లితెర న‌టీన‌టులు, ప్ర‌ముఖులు పాల్గొనే ఈ కార్య‌క్ర‌మంలో ప‌లువురు పేద క‌ళాకారుల‌కు ఆర్థిక సాయం అందిస్తామ‌ని తెలిపారు. 
 
బుల్లితెర‌పై వివిధ రంగాల్లో ప్ర‌తిభ చూపిస్తున్న న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు ఈ పుర‌స్కారాల్ని అందిస్తూ గ‌త యేడాది విబి ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ ఈ పుర‌స్కారాల్ని ప్రారంభించింది. 2015లో సీనియ‌ర్ న‌టులు రంగ‌నాథ్‌, రాళ్ల‌ప‌ళ్లి వంటి ప్ర‌ముఖుల‌కు పుర‌స్కారాల్ని అందించింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

మహిళలను దూషించడమే హిందుత్వమా? మాధవీలత

నిమిష ఉరిశిక్షను తాత్కాలికంగా నిలిపివేసిన యెమెన్

గండికోటలో బీటెక్ విద్యార్థి ఆత్మహత్య - అతనే హంతకుడా?

హాస్టల్‌లో ఉండటం ఇష్టంలేక భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య

భర్తను హత్య చేయించి.. కంట్లో గ్లిజరిన్ వేసుకుని నటించిన భార్య...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments