Webdunia - Bharat's app for daily news and videos

Install App

దిల్ రాజు, శేఖర్ కమ్ముల, వరుణ్ తేజ్ ముగ్గురి కరువూ తీర్చిన ఫిదా కలెక్షన్లు. బెంగాల్‌లోనూ హౌస్ ఫుల్

ఫీల్ గుడ్ సినిమాకు మారుపేరుగా నిలిచిన శేఖర్ కమ్ముల మూడేళ్ల తర్వాత తెరకెక్కించిన అద్భుతం ఫిదా.. తెలుగు ప్రేక్షకులు దేశంలో ఎక్కడున్నా సరే.. ఈ సినిమా చూసి ఫిదా అయిపోతున్నారని వార్తల మీద వార్తలు. తెలంగాణ మట్టి సంస్కృతిని ఇంత సుసంపన్నంగా, సహజాతిసహజంగా తీస

Webdunia
సోమవారం, 24 జులై 2017 (08:20 IST)
ఫీల్ గుడ్ సినిమాకు మారుపేరుగా నిలిచిన శేఖర్ కమ్ముల మూడేళ్ల తర్వాత తెరకెక్కించిన అద్భుతం ఫిదా.. తెలుగు ప్రేక్షకులు దేశంలో ఎక్కడున్నా సరే.. ఈ సినిమా చూసి ఫిదా అయిపోతున్నారని వార్తల మీద వార్తలు. తెలంగాణ మట్టి సంస్కృతిని ఇంత సుసంపన్నంగా, సహజాతిసహజంగా తీసిన సినిమా మరొకటి లేదన్న క్రెడిట్ దర్శకుడిగా శేఖర్ కమ్ములకు దక్కితే, నిర్మాతకు అత్యవసరమైన డబ్బులు, హీరోకు మరింత అవసరమైన హిట్ ఈ సినిమా ద్వారా పుష్కలంగా లభించేసిందనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే వందల కోట్లు వెచ్చించి తీసిన బాహుబలి సినిమా కంటే పాజటివ్ టాక్‌ను ఫిదా సంపాదించేసింది. నెటిజన్లయితే నిజంగానే ఫిదా అయిపోయారు. సినిమాల్లోని లోపాలను పట్టుకుని ఊచకోత కోసే నెటిజన్లు ఫిదాను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. శేఖర్ ఈజ్ కమింగ్ బ్యాక్ అంటూ తమ అబిమానం చూపిస్తున్నారు

 
అన్నిచోట్లా పాజిటివ్ టాక్ రావడంతో ఫిదా సినిమా కలెక్షన్లు అదరగొడుతున్నాయనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాలు సరేసరి. ఓవర్ సీస్‌లో ఫిదా జోరు మామూలుగా లేదు. గురవారం రోజు ప్రదర్శించిన ప్రీమియర్ షోలతో కలిపి తొలి రోజు 35000 డాలర్లకు పైగా కలెక్షన్లు వచ్చాయి. పాజిటివ్ రివ్యూస్ వస్తుండటంతో లాంగ్ రన్లో మిలియన్ డాలర్ల మార్క్ అందుకుంటుదన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. తెలుగు రాష్ట్రాల్లోనూ ఫిదా కలెక్షన్ల జోరు కనిపిస్తుంది. ముఖ్యంగా మల్టీపెక్ట్స్ ప్రేక్షకులను ఈ సినిమా గట్టిగానే ఫిదా చేస్తోంది.
 
వరుణ్ తేజ్, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఫీల్ గుడ్ లవ్ ఎంటర్ టైనర్ ఫిదా. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ముఖ్యంగా హీరోయిన్ సాయి పల్లవి పర్ఫామెన్స్‌కు ఆడియన్స ఫిదా అవుతున్నారు. క్లాస్ సినిమా దర్శకుడిగా తనకున్న ఇమేజ్‌ను కొనసాగిస్తూ శేఖర్ కమ్ముల రొమాంటిక్ ఎంటర్ టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. చాలా కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న మెగా హీరో వరుణ్ తేజ్‌కు ఆ కోరిక తీరిందనే చెప్పాలి. 
 
పశ్చిమబెంగాల్ వంటి బాలీవుడేతర ప్రాంతంలో కూడా తెలుగు సినిమాలు ఆడుతున్నాయనే విషయం చాలా లేటుగా తెలిసింది. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే కలకత్తాలో ఫిదా సినిమా విడుదలైన థియేటర్లు హౌస్ ఫుల్ రన్‌తో నడుస్తున్నాయని తాజా సమాచారం.  తెలుగు సినిమాలు అన్నీ ఇక్కడ విడుదల అవుతాయని కానీ రజనీకాంత్ సినిమా కబాలి తర్వాత ఫిదా మాత్రమే సూపర్ కలెక్షన్లను బెంగాల్లో సాధింజడం గ్రేట్ అంటూ అక్కడ ఉద్యోగ రీత్యా ఉంటున్న స్నేహితులు చెబుతున్నారు.
 
ఈ మధ్య కాలంలో ఇంత సంచలనాత్మకంగా ఇంత పాజిటివ్ స్పందనలు సంపాదించుకున్న సినిమా మరొకటి లేదు. నటనలో తెలంగాణ పిల్లగా అదరగొట్టిన సాయి పల్లవికోసమే కాదు. మనుషుల్లోని మంచితనాన్ని మొత్తంగా మూటగట్టి పాత్రలుగా అల్లుకుని జనాలకు మంచితనం రుచి చూపిస్తున్న శేఖర్ కమ్ములకోసం, ఇలాంటి సినిమాలు కూడా తీయగలనని నిరూపిస్తున్న దిల్ రాజు‌కోసం ఈ సినిమాను తప్పక చూడాల్సిందే. 
 
ఆనంద్, హ్యపీ డేస్, గోదావరి ఎంత మంచి విజయాలు అందుకున్నాయో మనందరికీ తెలుసు. చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఆ రేంజిలో శేఖర్ కమ్ముల తీసిన సినిమా ఫిదా అంటూ చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. మంచితనంతో మనుషులను చంపే శేఖర్ కమ్ముల కోసం కూడా ఫిదా చూడాల్సిందే.
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Bus crash: ఆప్ఘనిస్థాన్‌లో ఘోర ప్రమాదం.. బస్సు- ట్రక్కు ఢీ.. 71మంది సజీవ దహనం

అన్నయ్యతో చెల్లెలు సంసారం.. ప్రెగ్నెంట్ కావడంతో భర్తకు డౌట్.. ఎందుకోసమంటే?

టీచర్‌ని ప్రేమించిన స్టూడెంట్.. చీర కట్టుకుని వచ్చింది.. పెట్రోల్ పోసి నిప్పంటించాడు

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. ఆమెకే ఈ పరిస్థితి అంటే?

ఉప్పొంగిన గోదావరి- కృష్ణానదులు.. భద్రాచలం వద్ద మొదటి వరద హెచ్చరిక జారీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments