Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరైన భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకమే : వరుణ్ తేజ్

ఠాగూర్
ఆదివారం, 10 నవంబరు 2024 (09:37 IST)
భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే జీవితం నరకప్రాయంగా మారుతుందని మెగా ఫ్యామిలీ హీరో వరుణ్ తేజ్ అన్నారు. ఇపుడు ఈ కామెంట్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి. "మట్కా" మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో పాల్గొన్న వరుణ్ తేజా పెళ్ళి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయమన్నారు. భాగస్వామిక సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే అతని జీవితం నరకమే అవుతుందని చెప్పారు. 
 
తాను నటించిన తాజా చిత్రం "మట్కా" ఈ మూవీ ప్రమోషన్స్ భాగంగా వరుణ్ తేజ్ మాట్లాడుతూ, పెళ్లి అనేది జీవితంలో ఎంతో ముఖ్యమైన విషయం అన్నారు. భాగస్వామిగా సరైన వ్యక్తిని ఎంచుకోకపోతే అతని జీవితం నరకమే అని పేర్కొన్నారు.
 
మన జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని, విజయాన్ని పంచుకోవడానికి జీవితంలో మనకంటూ ఒక భాగస్వామి ఉండాలని తాను తెలుసుకున్నానని చెప్పారు. ఒక బంధం బలంగా ఉండాలంటే సరైన వ్యక్తిని ఎంచుకోవడంలో ఉంటుందన్నారు. అలాకాని పక్షంలో అది నరకమే అవుతుందని అన్నారు.
 
దాదాపు ఏడేళ్లు (లావణ్య త్రిపాఠి) రిలేషన్‌లో ఉండి ఒకరికొకరం సరిపోతామని తెలుసుకున్నామని, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నామని చెప్పారు. వ్యక్తిగత జీవితం చక్కగా ఉంటే మన కలలు సాకరం చేసుకోవడంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టవచ్చన్నారు. కాగా, గతేడాది నటి లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments