Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్ గనిలో తమన్నా -కొడితే - వీడియో సాంగ్ అదుర్స్‌..

Webdunia
గురువారం, 24 మార్చి 2022 (12:57 IST)
రింగారే రింగా... కొడితే.. అంటూ మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాక్సింగ్ రింగ్‌లో సాగిన పాట‌కు అనూహ్య‌స్పంద‌న ల‌భించింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్న సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. 
 
ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ తమన్నా 'కొడితే' ఫుల్ వీడియో సాంగ్ విడుదల చేసారు. ఈ మధ్యే విడుదలైన పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. యూ ట్యూబ్‌లో మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ‘కొడితే’ అంటూ సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాసారు. హారిక నారాయణ్ పాడిన ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు వీడియో సాంగ్ వచ్చింది. తమన్నా అంద చందాలు పాటకు అదనపు ఆకర్షణ. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా మేకోవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ చేసి సరికొత్త ఫిజిక్‌తో కనిపిస్తున్నారు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేస్తుంది. ఏప్రిల్ 8న సినిమా విడుదల కానుంది. మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు మేకర్స్.
 
నటీనటులు:
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
 
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: అల్లు బాబీ, సిద్దు ముద్ద
సమర్పకుడు: అల్లు అరవింద్
ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్
సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం: థమన్
పిఆర్ఓ: ఏలూరు శ్రీను, వంశీ కాక

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2024 : ఆ రెండు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందంటే...

పెరుగుతున్న సముద్ర నీటి మట్టాలు.. ప్రమాదం ముంగిట తీర ప్రాంతాలు!

కారు యజమానిని వణికించిన కాకులు - వీడియో వైరల్

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments