Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎప్రిల్ 8న వరుణ్ తేజ్ గని ఫిక్స్‌

Webdunia
బుధవారం, 2 మార్చి 2022 (16:25 IST)
Varun tej still
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రోమియో జూలియట్ పాటకు సైతం మంచి స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు. 

ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
 
నటీనటులు:
వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు
టెక్నికల్ టీమ్:
దర్శకుడు: కిరణ్ కొర్రపాటి
నిర్మాతలు: సిద్దు ముద్ద, అల్లు బాబీ
బ్యానర్స్: అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్
సమర్పకుడు: అల్లు అరవింద్
సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్
ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్
సంగీతం: థమన్
పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ సీఎం నుంచి తొలగిస్తే ఎట్లుంటుంది? (Video)

Republic Day: గణతంత్ర దినోత్సవం.. ఆగస్టు 15.. జెండా ఆవిష్కరణలో తేడా ఏంటంటే? (video)

Mumbai crime: 75ఏళ్ల వృద్ధురాలిపై 20 ఏళ్ల వ్యక్తి అత్యాచారం.. ఇంట్లోకి చొరబడి?

YS Sharmila: జగన్ బీజేపీ దత్తపుత్రుడు.. ఇకనైనా విజయసాయి నిజాలు చెప్పాలి.. షర్మిల

DJ Tillu Song: DJ టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సొరకాయ ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తెలంగాణ, ఏపిలో అధునాతన హెమటాలజీ ఎనలైజర్‌ను పరిచయం చేసిన ఎర్బా ట్రాన్సాసియా గ్రూప్

మామిడి అల్లం గురించి తెలుసా? అది తింటే ఏమవుతుంది?

కరకరమనే అప్పడాలు, కాళ్లతో తొక్కి మరీ చేస్తున్నారు (video)

తులసి టీ తాగితే ఈ సమస్యలన్నీ పరార్

తర్వాతి కథనం
Show comments