Webdunia - Bharat's app for daily news and videos

Install App

Varun Tej and Lavanya: గుడ్ న్యూస్- తల్లిదండ్రులం కాబోతున్న లావణ్య-వరుణ్

సెల్వి
మంగళవారం, 6 మే 2025 (13:32 IST)
మెగా హీరో వరుణ్ తేజ్ గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో తాము తల్లిదండ్రులు కాబోతున్నట్లు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించారు. గతేడాది మట్కా అనే పీరియాడికల్ సినిమాతో వచ్చిన వరుణ్ తేజ్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు. విభిన్న కథలతో ప్రేక్షకులను మెప్పిస్తోన్న ఆయన తన సహ నటి లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 
 
భార్యతో కలిసి వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు వరుణ్ తేజ్. 2017లో మిస్టర్ సినిమాలో హీరోయిన్ లావణ్య త్రిపాఠితో కలిసి నటించారు వరుణ్ తేజ్. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత అంతరిక్షం 9000 కేఎంపీహెచ్ సినిమాలోనూ మరోసారి జోడీగా నటించారు వరుణ్ - లావణ్య. 2023 జూన్ 8న హైదరాబాద్‌లోని నాగబాబు నివాసంలో వరుణ్ - లావణ్యల ఎంగేజ్‌మెంట్ ఘనంగా జరిగింది. 
 
నిశ్చితార్ధం జరిగిన దాదాపు 5 నెలల తర్వాత 2023 నవంబర్ 1న ఇటలీలో వరుణ్ - లావణ్యల వివాహం జరిగింది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి - వరుణ్ తేజ్ దంపతులు. తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. చిన్నారి షూతో చేతులు పట్టుకుని ఉన్న ఫోటోను వరుణ్, లావణ్యలు షేర్ చేశారు. మెగా ఫ్యామిలీలోకి మరో చిన్నారి అడుగుపెట్టనుండటంతో మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్ కులూలో ప్రకృతి బీభత్సం

నెల్లూరు జిల్లా జీవిత ఖైది రాసలీలలు, మహిళకు నూనె పూసి...

మరింతగా ముదరనున్న ఓట్ల చోరీ కేసు : సీఈసీపై విపక్షాల అభిశంసన!?

పాకిస్థాన్‌ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు - 657 మంది మృతి (video)

భర్త మొబైల్ ఫోన్ ఇవ్వలేదని భార్య ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments