Webdunia - Bharat's app for daily news and videos

Install App

సరికొత్త కథాంశంతో వస్తున్నానంటున్న వరుణ్ సందేశ్

Webdunia
మంగళవారం, 2 జనవరి 2024 (17:12 IST)
Varun Sandesh pooja
వరుణ్ సందేశ్ హీరోగా ఎమ్ 3 మీడియా, మహా మూవీస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న నూతన చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభం అయింది. ఈ సినిమా ద్వారా శ్రీ అద్యాన్త్ హర్ష డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమం అనంతరం ముహూర్తపు షాట్ కి హీరో వరుణ్ సందేశ్ క్లాప్ కొట్టగా, సినిమాటోగ్రాఫర్ అజయ్ కుమార్ మొదటి షాట్ చిత్రీకరించారు.
 
చిత్ర హీరో వరుణ్ సందేశ్ మాట్లాడుతూ ''సరికొత్త కథాంశంతో తీస్తున్న సినిమా ఇది. కథ, కథనాలు చాలా కొత్తగా గా ఉంటాయి. ఇప్పటివరకు నేను నటించిన సినిమాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది'' అని ప్రేక్షకులకు అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు
 చెప్పారు.
 
దర్శకుడు అద్యాన్త్  హర్ష మాట్లాడుతూ "ఇదొక విభిన్నమైన కథాంశంతో వస్తున్న థ్రిల్లర్ చిత్రం, హీరో లుక్ మరియు అతని క్యారెక్టరైజేషన్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి" అని తెలిపారు.
 చిత్ర నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ "డిఫరెంట్ మేకింగ్ అండ్ టేకింగ్ తో ఈ సినిమా ని నిర్మించబోతున్నాం. లొకేషన్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి.  కధ, కథనం తో పాటు విసుల్స్ కూడా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతినించే చిత్రంగా దీన్ని నిర్మించబోతున్నాం'' అని చెప్పారు. 
 నటీనటులు: వరుణ్ సందేశ్, రఘు కారుమంచి, ప్రమోదిని, బలగం జయరామ్, వైవా రాఘవ, రవితేజ నన్నిమాల, కాకినాడ నాని, ఫణి ఆచార్య, అపర్ణా దేవి, కుషాలిని పూలపా, ప్రసాద్ బెహరా తదితరులు ఈ చిత్రంలో ముఖ్య తారాగణం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దువ్వాడ, మాధురి పబ్లిక్‌గా చేస్తే తప్పులేదు కానీ నేను ఖైదీని కౌగలించుకుంటే తప్పా?

విజయవాడ సింగ్ నగర్ డాబాకొట్లు రోడ్డులో పడవలు, బెంబేలెత్తుతున్న ప్రజలు

మా ఆయనకు మహిళల పిచ్చి, 30 మందితో డేటింగ్, అందుకే చనిపోతున్నా...

ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్ బి.సుదర్శన్ రెడ్డి

పవన్ కళ్యాణ్‌ అంత పని చేశారా? హైకోర్టులో పిటిషన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

తర్వాతి కథనం
Show comments