Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ‌రుణ్ తేజ్ అంత‌రిక్ష్యం టీజ‌ర్ అదిరింది..!

Webdunia
గురువారం, 18 అక్టోబరు 2018 (16:18 IST)
మెగా హీరో వ‌రుణ్ తేజ్ న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ అంత‌రిక్షం 9000 కెఎమ్‌పిహెచ్. ఈ చిత్రాన్ని ఘాజీ ఫేమ్ సంక‌ల్ప‌రెడ్డి తెర‌కెక్కిస్తున్నారు. ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ పైన డైరెక్ట‌ర్ జాగర్లమూడి క్రిష్, సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఘాజీ సినిమాతో స‌రికొత్త చిత్రాన్ని అందించిన సంక‌ల్ప‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు కావ‌డంతో ఈ సినిమాపై ప్రారంభం నుంచి మంచి అంచ‌నాలు ఉన్నాయి. ఇక ఈరోజు అంత‌రిక్షం టీజ‌ర్ రిలీజ్ చేసారు.
 
హై టెక్నికల్‌ వాల్యూస్‌, హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ సారధ్యంలో యాక్షన్‌ సీన్స్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌ మేళవింపుతో వస్తున్న ఈ సినిమా వరుణ్ కెరియర్‌లో ఎప్ప‌టికీ నిలిచిపోయే సినిమా అవుతుంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగులో పూర్తిస్థాయి అంతరిక్షం నేపథ్యంలో వస్తున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. 
 
ఇలా టీజ‌ర్ రిలీజ్ చేసారో లేదో..యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. 1 మిలియ‌న్ వ్యూస్ క్రాస్ చేసింది. డిసెంబ‌ర్ 21న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు సినిమా గ‌ర్వించ‌ద‌గ్గ ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments