Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కూర్మ నాయకి

Webdunia
మంగళవారం, 28 నవంబరు 2023 (08:35 IST)
Varalakshmi Sarathkumar
వెర్సటైల్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో కె హర్ష వర్ధన్ దర్శకత్వంలో రూపొందనున్న యూనిక్  సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ 'కూర్మ నాయకి'. రోహన్ ప్రొడక్షన్స్, ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్ బ్యానర్స్ పై కె విజిత రావు నిర్మిస్తున్న ఈ చిత్ర ఈ రోజు గ్రాండ్ గా ప్రారంభమైయింది.
 
ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత డి వి వి దానయ్య  క్లాప్ ఇచ్చారు. లౌక్య సాయి కెమెరా స్విచ్ ఆన్ చేయగా బెక్కం వేణుగోపాల్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. హీరో తిరువీర్, శ్రీను గవి రెడ్డి మేకర్స్ కు స్క్రిప్ట్ అందజేస్తారు.
 
ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి రామ్ డీవోపీ గా పని చేస్తున్నారు. చోటా కె ప్రసాద్ ఎడిటర్. స్నిగ్ధ మణికాంత్, పూజిత సహా నిర్మాతలు వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి  రామాంజనేయలు ఆర్ట్ డైరెక్టర్.
 
మూవీ లాంచ్ ఈవెంట్ లో తిరువీర్ మాట్లాడుతూ.. ఇప్పటి ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. అన్ని విషయంలో చాలా కేర్ తీసుకొని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తప్పకుండా ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
 
 కె హర్ష వర్ధన్ మాట్లాడుతూ..  చాలా కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. ఒక దొంగ, దేవుడు, దెయ్యం నేపధ్యంలో వుంటుంది. ఇప్పుడు ఒక దేవుడు, దెయ్యాన్ని విడుదల చేస్తున్నాం. దొంగ ఎవరనేది త్వరలో ఆడియన్స్ పట్టుకుంటారు'' అన్నారు.
 
మణికాంత్ మాట్లాడుతూ.. ఇది మా మొదటి ప్రొడక్షన్. హర్ష వర్ధన్ గారు కథ చెప్పగానే చాలా నచ్చింది. అవుట్ పుట్ ఒక భారీ బడ్జెట్ సినిమాలానే వుంటుంది'' అన్నారు
 
నిర్మాతలు మాట్లాడుతూ, హర్ష చెప్పిన కథ చాలా నచ్చింది. మంచి టెక్నికల్ టీంతో సినిమాని ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నాం. కాన్సప్ట్ చాలా కొత్తగా వుంటుంది. తప్పకకుండా అందరినీ అలరిస్తుంది'' అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

మయన్మార్‌లో భారీ భూకంపం.. పేక మేడల్లా కూలిపోయిన భవనాలు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments