Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమలో విఫలం అలవాటైంది, నా మూడో భర్త ఇంటి నుంచి పారిపోయాడు (Video)

Webdunia
శుక్రవారం, 23 అక్టోబరు 2020 (13:10 IST)
సీనియర్ నటులు మంజుల - విజయ్ కుమార్ దంపతుల పెద్ద కుమార్తె వనిత. ఈమె కొన్ని సినిమాల్లో న‌టించింది. అయితే... వ‌నిత గ‌త కొంత కాలంగా వార్త‌ల్లో ఉంటుంది. కార‌ణం ఆమె వ్య‌క్తిగ‌త జీవితం. వనిత రెండో పెళ్లి కూడా పెటాకులు కావడంతో ఇటీవ‌ల మూడో పెళ్లి చేసుకుంది. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో క్రిస్టియన్ వివాహ పద్ధతిలో ఆమె పీటర్ పాల్‌ను గత జూన్‌లో మూడో పెళ్లి చేసుకుంది.
 
పెళ్లి చేసుకున్న‌ప్పుడు పీటర్ తనను బాగా అర్థం చేసుకున్నాడని.. ప్రేమ గురించి చాలా గొప్ప‌గా చెప్పింది. ఇక అతడితోనే త‌న జీవితం అంటూ ఓ పెద్ద స్టేట్మెంటే ఇచ్చింది. అయితే... పెళ్లి ఈ అమ్మ‌డుకు అస‌లు క‌లిసి రాన‌ట్టుంది. వివాహం చేసుకున్న వనిత-పీటర్ పాల్ జంట పైన పీటర్ మొదటి భార్య ఎలిజిబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో విడాకులు కాకుండానే పీటర్ మరో వివాహం చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
 
హెలెన్ ఫిర్యాదుతో పోలీసులు కొత్త జంటపై అప్పట్లోనే కేసు నమోదు చేశారు. ఇదిలా ఉంటే... గోవా ట్రిప్‌లో మద్యం తాగి పీటర్ కొట్టాడని చెన్నైకి రాగానే వనిత కోపంతో పీటర్ ఇంటి నుంచి గెంటేసిందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ప్రస్తుతం ఈ విషయం కోలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ వార్తలపై వనిత విజయ్ కుమార్ స్పందిస్తూ... ప్రేమలో విఫలం కావడం తనకు అలవాటైందని.. ధైర్యంగా ఉన్నానని.. ప్రేమను నమ్ముతూ మోసపోతున్నానని’ వనిత వాపోయింది.
 
నా పీటర్ మళ్లీ మద్యానికి బానిసయ్యాడు. మద్యం వల్ల అతడికి హార్ట్ ఎటాక్ వచ్చింది.. చాలా డబ్బులు ఖర్చు చేశాను.. ఇంటికి వచ్చాక కూడా పీటర్ ఏమాత్రం మారలేదు. ఇంటి నుంచి పారిపోయాడు..అంతే కానీ.. తాను వెళ్లగొట్టలేదని వీడియో ద్వారా తెలియ‌చేసింది.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

WhatsApp : జూన్ 30 నాటికి వాట్సాప్ ద్వారా 500 సేవలను అందిస్తాం.. నారా లోకేష్

NVIDIAలో రూ.3 కోట్ల వార్షిక జీతం ప్యాకేజీతో జాబ్ కొట్టేసిన హైదరాబాద్ అబ్బాయి

Dolphins : ఫ్లోరిడా తీరంలో వ్యోమగాములకు డాల్ఫిన్ల శుభాకాంక్షలు.. వీడియో వైరల్ (video)

Sunita Williams: సురక్షితంగా భూమికి తిరిగి వచ్చిన సునీతా విలియమ్స్.. ఆమెతో పాటు నలుగురు (video)

Posani: జైలు గేటు దగ్గర పోసానీతో సెల్ఫీలు తీసుకున్న సీఐడీ ఆఫీసర్లు.. ఏంటిది? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

ఒయాసిస్ ఫెర్టిలిటీ ఈ మార్చిలో మహిళలకు ఉచిత ఫెర్టిలిటీ అసెస్మెంట్‌లు

ఇలాంటివారు బీట్‌రూట్ జ్యూస్ తాగరాదు

తర్వాతి కథనం
Show comments