Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్విట్టర్‌లో 'వకీల్ సాబ్' సునామీ...

Webdunia
బుధవారం, 4 మార్చి 2020 (08:54 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్'. ఈ చిత్రం ఫస్ట్ లుక్ సోమవారం విడుదలైంది. అప్పటి నుంచి ఈ ఫస్ట్ లుక్ ట్విట్టర్‌లో సునామీ సృష్టిస్తోంది. 
 
పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత అంటే రెండేళ్ల విరామం తర్వాత నటిస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ ఆశలే ఉన్నాయి. పైగా, ఈ చిత్రానికి ముందు ఆయన నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది.
 
ఈ నేపథ్యంలో రిలీజ్ చేసిన 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. కేవలం 24 గంటల వ్యవధిలో 3.5 మిలియన్ల టైటిల్ ట్యాగ్‌లతో 'వకీల్ సాబ్' ఫస్ట్ లుక్ రికార్డు సృష్టించింది. 
 
దేశంలో ఇప్పటివరకు మరే ఫస్ట్ లుక్ ఈ ఘనత సాధించలేదు. అంతేకాదు, టాలీవుడ్‌లో అత్యధికంగా 25.3 వేల సార్లు రీట్వీట్ చేసిన ఫస్ట్ లుక్ కూడా ఇదే కావడం గమనార్హం. 
 
హిందీలో హిట్టయిన "పింక్" చిత్రాన్ని తెలుగులో 'వకీల్ సాబ్' పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. దీంట్లో పవన్ లాయర్ పాత్ర పోషిస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మాత కాగా, తమన్ సంగీతం అందిస్తున్నాడు. మే నెలలో ప్రేక్షకుల ముందుకురానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీ నాయకుడి విగ్రహం ఏర్పాటుకు ప్రజాధనం ఖర్చు చేస్తారా? సుప్రీంకోర్టు

బీజేపీలో చేరిన హీరో వరుణ్ సందేశ్ తల్లి

KTR: ఫార్ములా ఇ-రేసింగ్ కేసు.. ఛార్జ్‌షీట్‌లను సిద్ధం చేసిన ఏసీబీ.. కేటీఆర్ అరెస్ట్

అలహాబాద్ హైకోర్టు ఆదేశాలు.. యూపీలో కుల ప్రస్తావన ఇక వుండదు..

Naga Babu: అసెంబ్లీలో నాగబాబు తొలి ప్రసంగం.. ఎక్కడా వైకాపా పేరెత్తలేదు.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శనగలు తింటే శరీరానికి అందే పోషకాలు ఏమిటి?

కామెర్ల వ్యాధితో రోబో శంకర్ కన్నుమూత, ఈ వ్యాధికి కారణాలు, లక్షణాలేమిటి?

యాలకలు 6 ప్రయోజనాలు, ఏంటవి?

సర్జికల్ రోబోటిక్స్‌లో భారతదేశం యొక్క తదుపరి ముందడుగు: అధునాతన సాఫ్ట్ టిష్యూ రోబోటిక్ సిస్టమ్‌

కొత్తిమీర ఎందుకు వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments