Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్మయి మీ టూ వ్యవహారం.. వైరముత్తుకు కష్టాలు.. ఆ అవార్డును వెనక్కి తీసుకుంటారా?

Webdunia
శనివారం, 29 మే 2021 (15:12 IST)
Vairamuthu
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద లైంగిక ఆరోపణలతో 'మీ టూ' వ్యవహారం మొదలైంది. తరువాత దాదాపు 16 మంది మహిళలు వైరముత్తుపై లైంగిక వేధింపు ఆరోపణలు చేశారు. అయితే, అవేవీ ఆయన్ని జైలుకో, కోర్టుకో తీసుకెళ్లలేకపోయాయి. కానీ, వైరముత్తు గతంలోని చీకటి కోణాలు వృత్తి పరంగా మాత్రం ఆయన్ని విడిచి పెట్టడం లేదు.
 
ఎన్నో అద్భుతమైన పాటలు రాసిన వైరముత్తుకు తాజాగా 'ఓఎన్ వీ లిటరరీ అవార్డ్' ప్రకటించారు. ఈ అవార్డ్ 2016లో మరణించిన లెజెండ్రీ రైటర్ 'ఓఎన్ వీ కురుప్' పేరు మీదుగా ప్రతి ఏటా ఇస్తుంటారు. కానీ, ఈ సంవత్సరం వైరముత్తుకు ప్రతిష్ఠాత్మక సాహిత్య పురస్కారం ప్రకటించటం చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. ఎందరో తీవ్రమైన ఆరోపణలు చేసిన ఒక వ్యక్తికి అంతటి అవార్డ్ ఎలా ఇస్తారంటూ సోషల్ మీడియాలో నిరసనలు తెలుపుతున్నారు. 
 
పార్వతీ అనే తమిళ నటి ఇన్‌స్టాగ్రామ్‌లో వైరముత్తును తీవ్రంగా విమర్శించింది. ఓఎన్‌వీ కురుప్ ఒక రచయితగా తమిళ సంస్కృతిని ఎంతో సుసంపన్నం చేశారు. అటువంటి గొప్ప రైటర్, లిరిస్ట్ పేరున ఏర్పాటు చేసిన అవార్డ్ లైంగిక వేధింపు ఆరోపణలు ఎదుర్కొంటోన్న వారికి ఎలా ఇస్తారని ఆమె ప్రశ్నించింది.
 
డైరెక్టర్ అంజలి మెనన్, ఫిల్మ్ మేకర్ గీతూ మోహన్ దాస్, నటి రీమా కల్లింగల్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా వైరముత్తుకు వ్యతిరేకంగా తమ నిరసనల్ని గట్టిగానే వినిపించారు. జరుగుతోన్న పరిణామాల దృష్ట్యా ఓఎవన్‌వీ అవార్డ్ ప్రకటించిన జ్యూరి ప్రస్తుతం వైరముత్తు పేరును పునః పరిశీలిస్తోందని సమాచారం. ఆయనకు ప్రకటించిన అవార్డును వెనక్కి తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాపా అమ్మను కొట్టి ఉరివేశాడు.. రాయితో తలపై కొట్టాడు.. బొమ్మలు గీసి చూపించిన చిన్నారి..!!

డిసెంబర్ 22, 2032 యుగాంతం.. భూమిపైకి దూసుకొస్తున్న ఉల్క.. భారత్‌కు గండం!

కొత్త చీఫ్ ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ గుప్తా ఫ్యామిలీ నేపథ్యం ఏంటి?

నా దగ్గర కూడా ఆడియోలు వున్నాయి, కానీ వాటిని ఇలా లీక్ చేయను: కిరణ్ రాయల్

డ్రగ్స్ ఇచ్చాను.. మత్తులోకి జారుకోగానే అత్యాచారం చేస్తూ వీడియోలు తీశాను...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం