Webdunia - Bharat's app for daily news and videos

Install App

"వకీల్ సాబ్‌"ను ఎక్కడో నిలబెట్టిన ఆ నాలుగు అంశాలు!!

Webdunia
శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (12:20 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం వకీల్ సాబ్. బాలీవుడ్ మూవీ పింక్‌కు రీమేక్. దిల్ రాజు, బోనీ కపూర్‌లు సంయుక్తంగా నిర్మించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించగా, నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళలు హీరోయిన్లుగా నటించారు. శృతిహాసన్ అతిథి పాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ఏప్రిల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో విడుదల చేశారు.
 
మూడేళ్ళ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం కావడంతో ఆయన అభిమానుల సంబరాలకు హద్దులు లేకుండా పోయాయి. వాళ్లలో ఆ సంతోషం .. సంబరం థియేటర్ల దగ్గర కనిపిస్తోంది. టీజర్ .. ట్రైలర్ .. సాంగ్స్ ఈ సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతూ వచ్చాయి. దాంతో పవన్ అభిమానులంతా మొదటి రోజునే ఈ సినిమాను చూడటానికి పోటీ పడ్డారు.
 
ఈ సినిమా చూసిన పవన్ ఫ్యాన్స్ ఇందులో కొన్ని హైలైట్స్ గురించి ప్రస్తావిస్తున్నారు. పవన్ కల్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ చాలా బాగుందని అంటున్నారు. అలాగే, సినిమా కథ ప్రకారం హీరో పవన్ ఓ పావుగంట తర్వాత ఎంట్రీ ఇచ్చినప్పటికీ, ఆయన ఎంట్రీని డిజైన్ చేసిన తీరు కొత్తగా ఉందని చెబుతున్నారు.
 
అలాగే, సినిమా రెండో అర్థభాగంలో వచ్చే కోర్టు సీన్లలో పవన్ - ప్రకాశ్ రాజ్ మధ్య వాదోపవాదాలు నడిచే సీన్ క్లాప్స్ కొట్టిస్తున్నాయి. ఈ సన్నివేశాల్లో డైలాగ్స్ సూపర్బ్‌గా ఉన్నాయి.ఇక మెట్రో ట్రైన్‌లోని ఫైట్‌ను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని అంటున్నారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లిందనే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఈ చిత్రం తొలి ఆటతోనే సూపర్బ్ టాక్‌ను తెచ్చుకుంది. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments