Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామ్ పోతినేని 22 చిత్రంలో సూర్య కుమార్‌గా ఉపేంద్ర పరిచయం

దేవీ
మంగళవారం, 13 మే 2025 (09:42 IST)
Mahesh, Upendra, cherry
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మోస్ట్ అవైటెడ్ మూవీ #RAPO22తో సరికొత్తగా కనిపించనున్నారు.  'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'తో ఫేమ్ మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం. అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా హార్ట్ టచ్చింగ్ ఎంటర్టైనర్ లా వుండబోతోందని చిత్ర యూనిట్ చెబుతోంది. మైత్రీ మూవీ మేకర్స్  బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఇందులో హీరోయిన్‌గా భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు.
 
ఈ కథలో కొత్త కోణాన్ని తెస్తూ కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర "సూర్య కుమార్" పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర ప్రతి ఒక్కరు అభిమానించే సూపర్ స్టార్‌ల ప్రతినిధిగా నిలుస్తుంది. ఇవాళ విడుదలైన పోస్టర్‌లో ఆయన పాపరాజీ లైట్ల మధ్య స్టైలిష్‌గా కనిపించి, తన స్క్రీన్ ఇమేజ్‌ తో అదరగొట్టారు. ఈ నెల 15న సినిమా టైటిల్ గ్లింప్స్ విడుదల కానుంది.
 
ఈ చిత్రంలో కంప్లీట్ డిఫరెంట్ గెటప్‌లో రామ్ పోతినేని కనిపించనున్నారు. ఇప్పటి వరకు చేసిన హై వోల్టేజ్ యాక్షన్ చిత్రాలకు భిన్నంగా ఈ సినిమాతో ఆయన ఓ కొత్త అవతార్ ని ప్రజెంట్ చేస్తోంది. దర్శకుడు మహేష్ బాబు పి ఈ కథను అద్భుతంగా మలిచారు. పాన్-ఇండియా స్థాయిలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం అత్యున్నత స్థాయిలో ఉండబోతోంది
 
ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీం వర్క్ చేస్తోంది. కెమెరామెన్‌గా సిద్ధార్థ నుని కాగా వివేక్–మెర్విన్ మ్యూజిక్ అందిస్తున్నారు, నేషనల్ అవార్డ్ విన్నర్ శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా.ఈ డ్రీమ్ టీమ్ తో #RAPO22 భారీ స్థాయిలో రూపొందుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాలకు విమాన సర్వీసులు రద్దు

జేఎన్ఐఎం జిహాదీ గ్రూపు భీకరదాడి.. 100మందికి పైగా బలి

భారత్ బ్రహ్మోస్ దెబ్బకు బంకర్లలోకి పారిపోయి దాక్కొన్న పాక్ ఆర్మీ చీఫ్ (Video)

ప్రధాని మోదీ మీడియా సమావేశం ముగిసిన కొద్ది నిమిషాల్లోనే పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘన

భీతావహం, ఫారెస్ట్ రేంజర్ తలను కొరికి చంపేసిన పెద్దపులి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments