Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్ 5లో పెళ్లి జరిగిందోచ్.. ప్రియాంక-మానస్ పూలదండలు మార్చేసుకున్నారు..

Webdunia
బుధవారం, 27 అక్టోబరు 2021 (16:25 IST)
Manas Dance
బిగ్ బాస్ సీజ‌న్ 5 చాలా ర‌స‌వ‌త్త‌రంగా సాగుతుంది. ఈ వారం మొత్తంగా ఎనిమిది మంది ఎలిమినేషన్ కోసం నామినేట్ కాగా.. ప్లేబ్యాక్ సింగర్ శ్రీరామచంద్ర, ఆర్జే కాజ‌ల్ సేఫ్ చేశారు. ఇక‌.. లోబో, జెస్సీ, ప్రియ, ఆనీ మాస్టర్, యాంకర్ రవి, సిరి హన్మంతు ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ‌లో ఉన్నారు. 
 
అనంత‌రం .. పెళ్లి సంబంధాల టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్‌లో మానస్, ప్రియాంక, షణ్ముఖ్, సిరి, శ్రీరామ్‌లు పాల్గొన్నారు. ఈ టాస్కులో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్స్‌ వాళ్ళకి కాబోయే భాగస్వామికి ఎలాంటి లక్షణాలు ఉండాలో చెప్పాలని అన్నారు.
 
ముందుగా తాను పెళ్లి చేసుకునే.. అమ్మాయి బ‌బ్లీగా.. అంద‌రితో క‌లుపుకోలుగా ఉండాల‌న్నాడు సింగ‌ర్ శ్రీ‌రామ్. ఇక సన్నీ.. త‌న‌దైన శైలిలో చెప్పారు. త‌న‌కు కాబోయే అమ్మాయి నమ్మకం, నిజాయితీ, అర్థం చేసుకునే స్వభావం ఉండాల‌ని చెప్పాడు. త‌రువాత‌.. ప్రియాంక త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టింది. తాన‌ను కేరింగ్ గా చూసుకునే అబ్బాయి కావాల‌ని.. అత‌న్ని కూడా చూపించే ప్రియాంక లాంటి అమ్మాయిని ఎవరు చేసుకున్నా అదృష్టవంతులేనని చెప్పాడు.
 
ఇక మానస్‌.. నేను ఎక్కువగా అలుగుతాను, అప్పుడు తనే ముందుగా నన్ను బుజ్జగించాలి. ఇద్దరి కుటుంబాలను ప్రేమగా చూసుకోవాలి అని తెలిపాడు. అనంత‌రం.. ఇంటి సభ్యులంతా ప్రియాంక – మానస్‌ను బెస్ట్‌ కపుల్‌గా ఎన్నుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌ వారిద్దరూ పూలదండలు మార్చుకునేలా చేసి పెళ్లి జరిపించేశాడు. అనంతరం వీళ్లిద్దరూ ‘గువ్వా గోరికంతో’ పాటకు జంటగా స్టెప్పులేసి అదరగొట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మిథున్ రెడ్డికి షాకిచ్చిన సుప్రీంకోర్టు... సరెండర్‌కు కూడా నో టైమ్..

Hyderabad: పెళ్లి చేసుకుంటానని నమ్మించి పలుమార్లు అత్యాచారం చేశాడు..

Hyderabad: స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25- ఆరవ పరిశుభ్రమైన నగరంగా హైదరాబాద్

ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో లాలూకు చిక్కులు.. కేసు విచారణ వేగవంతం చేయాలంటూ...

భార్యాపిల్లలను బావిలో తోసేశాడు... ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments