Webdunia - Bharat's app for daily news and videos

Install App

టాకీ పూర్తిచేసుకున్న "ఉందా.. లేదా.."?

రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఉందా..లేదా?’. తాజాగా విజయవాడలో జరిగిన షెడ్యూల్‌తో టాకీ పూర

Webdunia
శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (19:17 IST)
రామకృష్ణ, అంకిత జంటగా జయకమల్ ఆర్ట్ బ్యానర్‌పై అమనిగంటి వెంకట శివప్రసాద్‌ దర్శకత్వంలో అయితం ఎస్.కమల్ నిర్మిస్తున్న స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ మూవీ ‘ఉందా..లేదా?’. తాజాగా విజయవాడలో జరిగిన షెడ్యూల్‌తో టాకీ పూర్తిచేసుకుంది. 
 
ఈ సందర్భంగా దర్శకుడు అమనిగంటి వెంకట శివప్రసాద్‌ మాట్లాడుతూ సస్పెన్స్ థ్రిల్లర్ జోన‌ల్‌లో రూపొందుతున్న మా చిత్రం సక్సెస్‌ఫుల్‌గా టాకీ పూర్తిచేసుకుందన్నారు. విజయవాడలో జరిగిన షెడ్యూల్‌లో కామెడీ సన్నివేశాలను, హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాలను నిమ్రకాలేజ్‌లో ప్రకాశం బ్యారేజ్ వద్ద చిత్రీకరించినట్లు తెలిపారు. 
 
నిర్మాత అయితం ఎస్.కమల్ మాట్లాడుతూ... ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందిలేకుండా షూటింగ్ పూర్తిచేసుకున్నామని అన్నారు. సీనియర్ ఆర్టిస్ట్‌‌లు జీవా, రామ్ జగన్, ఝూన్సీ, సాయి బాగా సపోర్ట్ చేశారన్నారు. టెక్నీషిన్స్ సపోర్టుతో ఈ సినిమాను కాంప్రమైజ్ కాకుండా తీస్తున్నామని తెలిపారు. బ్యాలెన్స్ ఉన్న రెండు సాంగ్స్‌ను పూర్తిచేసి పోస్ట్ ప్రోడక్షన్‌కు వెళ్లనున్నట్లు తెలిపారు. అక్టోబరులో ఆడియోని విడుదల చేయనున్నట్లు తెలిపారు.
 
ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్ కె బంగారి, పాటలు నాగరాజు, మ్యూజిక్: శ్రీమురళి, కొరియోగ్రాఫర్: నందు జెన్నా, విఎఫ్ఎక్స్: మణికాంత్ -సాగర్, నిర్మాత: అయితం ఎస్.కమల్, కథ-దర్శకత్వం: అమనిగంటి వెంకట శివప్రసాద్.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh Meets PM: ఢిల్లీలో ప్రధానిని కలిసిన నారా లోకేష్ ఫ్యామిలీ

Duvvada Srinivas: దివ్వెల మాధురితో దువ్వాడ శ్రీనివాస్ నిశ్చితార్థం.. ఉంగరాలు తొడిగారుగా! (video)

జమ్మూలో బాధ్యతలు.. సిద్ధిపేటలో భూ వివాదం... జవానుకు కష్టాలు.. తీరేదెలా?

పాకిస్తాన్‌కు సైనిక సమాచారం చేరవేసిన యూ ట్యూబర్ జ్యోతి మల్హోత్రా అరెస్ట్

IMD: ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

తర్వాతి కథనం
Show comments