Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

సెల్వి
శనివారం, 1 ఫిబ్రవరి 2025 (17:50 IST)
ప్రముఖ సింగర్ ఉదిత్ నారాయణ్‌ చిక్కుల్లో పడ్డారు. ముంబైలో జరిగిన ఓ కన్సర్ట్‌లో సింగర్ ఉదిత్ నారాయణ్ అనుచిత ప్రవర్తించారు. దీంతో ఆయన ప్రస్తుతం ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు. సెల్ఫీలు తీసుకోవడానికి వచ్చిన మహిళా ప్రేక్షకులకు ముద్దులు పెట్టి ఉదిత్ నారాయణ అడ్డంగా బుక్కయ్యారు. 
 
మహిళా ప్రేక్షకులకు బుగ్గపై ముద్దులు.. లిప్ లాక్‌లు ఇవ్వడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఇదేం పాడుబుద్ధి అంటూ ఆయనపై నెటిజన్లు ఆయనపై మండిపడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 
 
వివరాల్లోకి వెళితే.. నారాయణ్ పాటలు పాడుతుండగా కొంతమంది మహిళా అభిమానులు సెల్ఫీ కోసం దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఒక్కొక్కరికి చెంప మీద ముద్దు పెట్టారు ఉదిత్. ఇంతలో మర మహిళా అభిమాని దగ్గరికి వచ్చి సెల్ఫీ తీసుకున్న తర్వాత ఉదిత్‌కి బుగ్గ మీద ముద్దు ఇవ్వబోయింది.
 
అయితే వెంటనే ఉదిత్ ఆమె పెదవులపై ముద్దు పెట్టేశారు. ఈ పనికి ఆ అమ్మాయి షాకైంది. ప్రస్తుతం ఉదిత్ నారాయణ్ హ్యాష్ ట్యాగ్ నేషనల్ వైడ్ ట్రెండింగ్‌లో ఉంది. అయితే ఈ ఘటనపై ఉదిత్ కూడా రియాక్ట్ అయ్యారు. 
 
ముద్దు పెట్టే విషయంలో తనకు వేరే ఉద్దేశం లేదన్నారు. అభిమానులపై తనకున్న ప్రేమను తెలియజేసేందుకే అలా చేశానంటూ చెప్పుకొచ్చారు. అది కేవలం ఆత్మీయత, అభిమానం. నేను ఎంతో మర్యాద కలిగిన వ్యక్తిని. ఆత్మీయత అలానే వుంటుందని చెప్పుకొచ్చారు. కొంతమంది కావాలనే దీనిని వివాదం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అమరావతిలో అభివృద్ధి పనుల పునఃప్రారంభం: జగన్‌ను తప్పకుండా ఆహ్వానిస్తాం

రోడ్డు ప్రమాదం: వెంటనే స్పందించిన నాదెండ్ల మనోహర్

Hyderabad, పివిఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ హైవే ఫ్లై ఓవర్ నుంచి వేలాడిన తాగుబోతు (video)

భారత్ పర్యటనలో జేడీ వాన్స్.. అక్షరధామ్ ఆలయంలో వాన్స్ ఫ్యామిలీ

'నేను ఓ రాక్షసుడుని చంపేశాను' : కర్నాటక మాజీ డీజీపీ హత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

ఉదయాన్నే వరెస్ట్ బ్రేక్ ఫాస్ట్ తీసుకుంటున్నారా?

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

World Liver Day 2025 ప్రపంచ కాలేయ దినోత్సవం 2025 థీమ్ ఏమిటి?

తర్వాతి కథనం
Show comments