Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయనిధి స్టాలిన్, కీర్తి సురేష్ నటించిన మామన్నన్ తెలుగులో నాయకుడుగా రాబోతుంది

Webdunia
గురువారం, 6 జులై 2023 (23:16 IST)
Udayanidhi Stalin, Keerthy Suresh
ఉదయనిధి స్టాలిన్, వడివేలు మరియు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం మామన్నన్‌. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మామన్నన్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనితో దర్శకుడు హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేయనున్నారు.
 
తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్,  కీర్తి సురేష్ కూడా నటించిన ఈ చిత్రం తెలుగు హక్కులను పొందాయి. 'నాయకుడు' అనే టైటిల్‌తో ఈ చిత్రం జూలై 14న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో అద్భుతాలు చేయడంతో పాటు, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లు దీనికి మద్దతు ఇవ్వడంతో 'నాయకుడు' తెలుగులో గ్రాండ్ రిలీజ్ అవుతుంది.
 
విడుదల తేదీ పోస్టర్ లో వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్,  కీర్తి సురేష్‌ల ముఖాల్లో ఇంటెన్సిటీ మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఉదయనిధి పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని చేపట్టే ముందు నటుడిగా చేసిన చివరి చిత్రం కావడం విశేషం.  
 
ఈ చిత్రానికి ఉదయనిధి రెడ్ జెయింట్ సినిమాస్ మద్దతు ఉంది. టెక్నికల్ టీం లో ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ AR రెహమాన్, సినిమాటోగ్రాఫర్ తేని ఈశ్వర్, ఎడిటర్ సెల్వ ఉన్నారు.
 
తారాగణం: ఉదయనిధి స్టాలిన్, వడివేలు, ఫహద్ ఫాసిల్, కీర్తి సురేష్, లాల్, సునీల్

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆర్ఆర్ఆర్ కేసు : విజయపాల్‌కు సుప్రీంకోర్టుకు షాక్...

మహారాష్ట్ర కొత్త సీఎంగా దేవేంద్ర ఫడ్నవిస్.. మద్దతు పలికిన అజిత్ పవార్

పుష్ప 2 ఎప్పుడొస్తుందా చూద్దామని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నా: అంబటి రాంబాబు (video)

విమానంలో విషపూరిత పాములు... వణికిపోయిన ప్రయాణికులు

స్పేస్ ఎక్స్ విమానంలో భూమికి తిరిగిరానున్న సునీత-విల్మోర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments