Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉదయభానుకు ట్విన్స్ పుట్టబోతున్నారా? మరి అవమానించిన సింగర్ సునీతనా?

అమెరికాలో జరిగిన ఓ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించినప్పుడు.. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ గాయని తనను అవమానించిందని ఉదయభాను పేరు చెప్పకుండా వెల్లడించింది. ఆమెను స్టేజ్ మీదకు పిలిచేటప్పుడు తానెంతో గౌర

Webdunia
సోమవారం, 29 ఆగస్టు 2016 (14:54 IST)
ఉదయభాను గర్భవతి అని మొన్నటికి మొన్న వార్తలు వచ్చాయి. ఈ రోజు ఆమె మిస్సైందని వార్తలొస్తున్నాయి. ఈ వార్తలపై సూపర్ గర్ల్ ఉదయభాను స్పందించింది. తెలుగు టీవీ రంగంలో ఉదయభాను యాంకరింగ్‌లో తనకంటూ ఓ స్థానాన్ని సంపాదించుకుంది. టాప్ యాంకర్‌గా కొనసాగుతున్న ఈమె కొంతకాలంగా కనిపించట్లేదు. ఇందుకు కారణం తాను గర్భవతినని చెప్పుకొచ్చింది. అంతేగాకుండా తనను ఓ సింగర్ అవమానించిందని.. అందుకే బయటికి రావట్లేదని కూడా చెప్పింది. 
 
అమెరికాలో జరిగిన ఓ ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యతగా వ్యవహరించినప్పుడు.. టాలీవుడ్‌కు చెందిన ఓ ప్రముఖ గాయని తనను అవమానించిందని ఉదయభాను పేరు చెప్పకుండా వెల్లడించింది. ఆమెను స్టేజ్ మీదకు పిలిచేటప్పుడు తానెంతో గౌరవంగా గొప్పగా చెప్పేదాన్నని.. కానీ టూర్ చివరి రోజున ఆమె స్టేజ్ పైకి వెళ్ళి తనను పిలుస్తానని తెలిపింది. చెప్పినట్లే అందరినీ పిలిచిందీ కానీ తనను మాత్రం పిలవలేదని, చివరికి తనంతట తాను వేదికపైకి వెళ్తుండగా.. ఆ సింగర్‌కు చెందిన ఆర్కెస్ట్రా ఓ నీరసపు ట్యూన్‌ ప్లే చేసి తనను అవమానించారని ఉదయభాను చెప్పుకొచ్చింది. 
 
ఆపై ఆ సింగర్ తనకు ఏదో సర్దిచెప్పినా.. తాను పట్టించుకోవట్లేదని ఉదయభాను తెలిపింది. ఇలాంటి అవమానాలు తనకు ఎన్నో జరిగాయని తెలిపింది. అందుకే తనకు ఇండస్ట్రీలో ఎవ్వరూ లేరని చెప్పింది. తనకు  బయట స్నేహితులే మద్దతిస్తున్నారని చెప్పుకొచ్చింది. కాగా.. ఉదయభాను అవమానించిన సింగర్ ఎవరనే దానిపై ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఆమె సునీత అని కొందరంటుంటే.. ఆమె కాదని మరికొందరు వాదిస్తున్నారు. ఉదయభాను పేరు చెప్పకుండా తనకు జరిగిన అవమానాన్ని చెప్పడంతో ఆ ఫీమేల్ సింగర్ ఎవరై ఉంటారని ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా చర్చసాగుతోంది. ఇంతకీ ఆ సింగర్ ఎవరో మరి..?
 
ఇదిలా ఉంటే.. ఉదయభానుకు కవలపిల్లలు పుట్టబోతున్నారట. విజయవాడకు చెందిన విజయ్‌ని పెళ్ళాడిన ఉదయభానుకు ట్విన్స్ పుట్టబోతున్నట్లు డాక్టర్లు నిర్ధారించారట. ప్రస్తుతం ఉదయభానుకు 9 నెలలు. ఒకటి రెండు రోజుల్లో ఉదయభాను ట్విన్స్‌కు జన్మనిచ్చే అవకాశం ఉందని తెలిసింది. దీంతో విజయ్-ఉదయభానుల సంతోషానికి అవధుల్లేవు. ఎనీవే ఆల్ ది బెస్ట్ ఉదయభాను..
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రసన్న ఇంటిపై దాడి.. మూడు హత్యలు, ఆరు హత్యాయత్నాలు, 12 దాడులు: జగన్ ఫైర్

Hyderabad: రోజూ మద్యం తాగి వస్తే భరించేదెవరు? బండరాయితో కొట్టి చంపేసిన భార్య

EV Cycle: ఎలక్ట్రిక్ సైకిల్‌ను తయారు చేసిన ఇంటర్ విద్యార్థి సిద్ధు.. పవన్ ఏం చేశారంటే?

Bangalore: భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కి చంపేసిన భర్త

సీమాంధ్ర పాలకుల కంటే తెలంగాణకు కేసీఆర్ ద్రోహమే ఎక్కువ: రేవంత్ రెడ్డి (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం