Webdunia - Bharat's app for daily news and videos

Install App

జైపూర్ ప్యాలెస్‌‌లో అమ్మకు దెయ్యం కనిపించింది.. ఆమెతో మాట్లాడింది కూడా?

Webdunia
శనివారం, 4 జూన్ 2022 (18:16 IST)
Twinkle Khanna
బాలీవుడ్ నటి, సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ అర్ధాంగి ట్వింకిల్ ఖన్నా జైపూర్ ప్యాలెస్‌కు సంబంధించి ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. యూట్యూబ్ చానల్ కోసం జైపూర్ రాజవంశీకురాలు రాజమాత పద్మినీ దేవితో ముచ్చటించారు. 
 
గతంలో ఓసారి తన తల్లి జైపూర్ రాయల్ ప్యాలెస్‌ను సందర్శించిందని, అప్పుడు ఆమెకు ఆ రాజ భవనంలో దెయ్యం కనిపించిందని ట్వింకిల్ తెలిపారు. అంతేకాదు, తన తల్లి ఆ దెయ్యంతో మాట్లాడిందని కూడా చెప్పారు. 
 
1990లో 'లేకిన్' అనే హిందీ చిత్రం షూటింగ్ కోసం డింపుల్ కపాడియా అక్కడికి వెళ్లిందని, ఓ రాత్రంతా జైపూర్ ప్యాలెస్ లోనే గడిపిందని ట్వింకిల్ వివరించారు. 
 
తన తల్లి పడుకుని ఉండగా, ఆమె పడక పక్కనే ఓ మహిళ నిల్చుని కనిపించిందని, అది దెయ్యం అని తన తల్లి గుర్తించినట్టు తెలిపారు. దాంతో చాలాసేపు మాట్లాడినట్టు కూడా పేర్కొన్నారు.
 
అయితే, రాజమాత పద్మినీ దేవి దీనిపై స్పందిస్తూ... ఆ సమయంలో డింపుల్ నటిస్తోంది ఓ దెయ్యం సినిమాలో అని, ఆ ప్రభావం ఆమెపై పడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. రోజంతా దెయ్యంలా నటించి, దెయ్యం ఆలోచనలతోనే పడుకున్నావు కాబట్టి, నీకు దెయ్యం కనిపించినట్టు భ్రమపడుతున్నావని డింపుల్‌కు వివరించినట్టు రాజమాత పద్మినీ దేవి వెల్లడించారు. ఇంకా జైపూర్ ప్యాలెస్‌లో దెయ్యాలేవీ లేవన్న విషయాన్ని ఆమెకు స్పష్టం చేశానని తెలిపారు. 
 
'లేకిన్' చిత్రంలో డింపుల్ 'రేవా' అనే దెయ్యం పాత్ర పోషించారు. గుల్జార్ తెరకెక్కించిన ఈ చిత్రంలో వినోద్ ఖన్నా, అంజాద్ ఖాన్, అలోక్ నాథ్ తదితరులు నటించారు. ఈ సినిమాలో అత్యుత్తమ నటనకు గాను డింపుల్ కపాడియాకు ఫిలింఫేర్ అవార్డు కూడా లభించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments