Webdunia - Bharat's app for daily news and videos

Install App

శిశుపాలుడి వధకు వందకారణాలు.. త్రిష పెళ్లాడక పోవడానికి నూటొక్క కారణాలు

మూడు పదులు దాటిన వయస్సులో మన హీరోయిన్లు పెళ్లికి దూరంగా ఉండటానికి కెరీర్ పోగొట్టుకోకూడదన్నదే ప్రధాన కారణం. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా గుర్తింపు పొందిన ప్రభాస్, రానా కూడా బాహబలి చిత్రం పూర్తయిన తర్వాత కూడా పెళ్లిమాట ఎత్తకుండా ఎవరి షూటి

Webdunia
సోమవారం, 12 జూన్ 2017 (08:15 IST)
మూడు పదులు దాటిన వయస్సులో మన హీరోయిన్లు పెళ్లికి దూరంగా ఉండటానికి కెరీర్ పోగొట్టుకోకూడదన్నదే ప్రధాన కారణం. టాలీవుడ్‌లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్లుగా గుర్తింపు పొందిన ప్రభాస్, రానా కూడా బాహబలి చిత్రం పూర్తయిన తర్వాత కూడా పెళ్లిమాట ఎత్తకుండా ఎవరి షూటింగుల్లో వారు ఉన్నారంటే కెరీర్‌పై దృష్టి పెట్టడమే కారణం. ఈ కోవలోనే మన హీరోయిన్లు కూడా నడుస్తుండటం గమనార్హం. 
 
దాదాపు 36 ఏళ్లు నిండిన అనుష్క తాను సైన్ చేసిన చిత్రాలు పూర్తి చేయడం కోసమే ఇంకో రెండేళ్లు పెళ్లి మాటెత్తవద్దని తన తల్లిదండ్రులకు తేల్చి చెప్పిన విషయం తెలసిందే. వృత్తి పట్ల అంకితభావం, ప్రొఫెషనల్ తత్వం లేకపోతే హీరోయిన్లు లేటు వయసులోనూ పెళ్లి చేసుకోకుండా ఉంటారా అన్నది ప్రశ్న. అనుష్కతోపాటు కాజల్, నయనతార, త్రిష వంటి సీనియర్ నటిలు కూడా ఇదే కోవలో నడుస్తుండటం విశేషం. 
 
శిశుపాలుని వధకు అతడు చేసిన నూరు తప్పులే కారణం అని మహాభారతం చెబుతుంది. పలానా పని చేయకపోవడానికి వంద కారణాలున్నాయని దక్షిణాదిలో నుడికారం ఉంది. అయితే హీరోయన్‌ త్రిష మాత్రం తాను పెళ్లి చేసుకోకపోవడానికి 101 రీజన్స్‌ ఉన్నాయని చెబుతున్నారు. 
 
మూడు పదుల వయసు దాటినా ఈ చెన్నై సుందరి ఇప్పటికీ టాప్‌ హీరోయిన్‌లలో ఒకరిగా ఉంటున్నారు. పెళ్లి కబురు మాత్రం చెప్పడం లేదు. అయితే ఆదివారం ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చటించిన సందర్భంలో త్రిష తన పెళ్లి గురించి స్పందించారు. ఓ అభిమాని ‘మీరంటే నాకు చాలా ఇష్టం. కనీసం నేను పెళ్లి చేసుకునేవరకైనా మీరు చేసుకోకండి’ అని రిక్వెస్ట్‌ చేశాడు. 
 
దీనికి త్రిష బదులిస్తూ ‘నేను పెళ్లి చేసుకోకపోవడానికి వంద కారణాలు ఉన్నాయి. నీ రిక్వెస్ట్‌తో ఆ లిస్ట్‌ 101కి చేరింది’ అని బదులిచ్చారు. అంటే.. త్రిష పెళ్లి చేసుకోకపోవడానికి నూటొక్క కారణాలు ఉన్నాయన్నమాట. చూస్తుంటే ఈ చెన్నయ్ చంద్రం కూడా మరో రెండు మూడేళ్లు పెళ్లి మాట ఎత్తకుండానే సినిమాల్లో మునిగేటట్టే ఉంది మరి.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్: రూ.5లకే ఇడ్లీ, పూరీ, వడ, ఉప్మా, పొంగల్

రొట్టెల పండుగలో- లక్షమందికి పైగా భక్తులు హాజరు.. కోరికలు నెరవేరాలని కొందరు..

దేశ రాజధానిని వణికించిన భూకంపం.. ప్రజలు రోడ్లపైకి పరుగో పరుగు

పండించడానికి ఒక సంవత్సరం పట్టే మామిడి పండ్లను ట్రాక్టర్లతో తొక్కిస్తారా? (video)

Bandi Sanjay Kumar: బండి సంజయ్ పుట్టిన రోజు.. పాఠశాల విద్యార్థులకు 20వేల సైకిళ్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments