Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమ పేరుతో బుల్లితెర నటి మోసం .. ప్రియుడితో సహా ముగ్గురి అరెస్టు

Webdunia
బుధవారం, 21 ఏప్రియల్ 2021 (13:18 IST)
ప్రేమ పేరుతో ఓ యువకుడిని బుల్లితెర నటి మోసం చేసింది. ఈ మోసంపై నిలదీసినందుకు అతనిపై కేసు పెట్టి అరెస్టు చేయింది. ఈ కేసులో అతనితో పాటు.. అతని స్నేహితులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, చెన్నై నగర శివారు ప్రాంతమైన మణలి బాలాజీ పాళయానికి చెందిన జెన్నిఫర్ (24) అనే మహిళ బుల్లితెర నటిగా కొనసాగుతోంది. ఈమెకు శరవణ్ అనే వ్యక్తితో 2019లో వివాహమైంది. అయితే, వీరి దాంపత్య జీవితం ఎంతోకాలం నిలవలేదు. విభేదాల కారణంగా ఇద్దరూ విడిపోయారు. ప్రస్తుతం వీరిద్దరి విడాకుల వ్యవహారం కోర్టులో సాగుతోంది. 
 
ఈ క్రమంలో టీవీ సీరియళ్లలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న నవీన్‌ కుమార్ (25)తో జెన్నిఫర్‌కు ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమకు దారితీసింది. అయితే, జెన్నిఫర్‌కు అప్పటికే వివాహమైన విషయం తెలిసిన నవీన్ కుమార్ ఆమెను నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. 
 
అప్పటికీ శాంతించని నవీన్ కుమార్ ఆదివారం తన స్నేహితులతో కలిసి జెన్నిఫర్ ఇంటికి వెళ్లి గొడవపడ్డాడు. ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా నవీన్‌తోపాటు ఆయన స్నేహితులు పాండియన్ (24), కార్తికేయన్‌లను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జామా మసీదు సమీపంలో అల్లర్లు - బలగాల మొహరింపు

ఆమె వయసు 36, ముగ్గురు పిల్లల తల్లి - ఇంటర్ విద్యార్థితో లేచిపోయింది...

Ambati Rayudu: పవన్‌కు ఇష్టం లేకున్నా.. ఏపీకి సీఎంను చేస్తా: అంబటి రాయుడు

పొరుగు రాష్ట్రాల మహిళలకు ఇప్పటికీ విద్యా హక్కు లేదు: మంత్రి దురైమురుగన్

ఉద్యోగం పేరుతో నయా మోసం... ఫేక్ కంపెలీ పేరుతో ఆఫర్ లెటర్... రూ.2.25 లక్షలు వసూలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Extra Marital Affair: వివాహేతర సంబంధాలకు కారణాలు ఏంటి? సైకలాజిస్టులు ఏం చెప్తున్నారు?

హైదరాబాద్‌లో అకింత్ వెల్‌నెస్ సెంటర్ 'అంకితం' ప్రారంభం

సన్ ఫ్లవర్ ఆయిల్ మంచిదా చెడ్డదా?

పులి త్రేన్పులు వస్తున్నాయా? జీలకర్ర నీరు తాగి చూడండి

నడుస్తున్నప్పుడు ఇలాంటి సమస్యలుంటే మధుమేహం కావచ్చు

తర్వాతి కథనం
Show comments