Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఊచకోత కోసేందుకు రెడీగా కోర చిత్రంలో సునామీ కిట్టి లుక్

డీవీ
సోమవారం, 2 డిశెంబరు 2024 (08:39 IST)
Tsunami Kitty Look
కన్నడలో ఒకరైన యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితులే. ఆయన సమర్పణలో సునామీ కిట్టి, చరిష్మా, పి మూర్తి ప్రధాన పాత్రలతో ‘కోర’ అనే చిత్రాన్ని ఒరటాశ్రీ తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్, రత్నమ్మ మూవీస్ పతాకాలపై డాక్టర్ ఎబి నందిని, ఎఎన్ బాలాజీ, పి మూర్తి సంయుక్తంగా నిర్మించారు.
 
తాజాగా కోర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను గమనిస్తుంటే.. హై ఆక్టేన్ యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఈ చిత్రం రాబోతోందనిపిస్తోంది. సునామీ కిట్టిని ఆగ్రహావేశాలు ఈ లుక్‌లో కనిపిస్తున్నాయి. అతని ముఖం మీద గాయాలు, ఇంటెన్స్ లుక్‌ని చూస్తుంటే ఊచకోత కోసేందుకు రెడీగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా కోరా చిత్రం ఉండబోతోంది.
 
ఈ చిత్రంలో ఎం.కె.మాత, మునిరాజు, నీనాసం అశ్వత్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెల్వం మాతప్పన్ సినిమాటోగ్రఫర్‌గా పని చేస్తుండగా.. బిఆర్ హేమంత్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. కె. గిరీష్ కుమార్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈ చిత్రానికి స్టంట్స్ కొరియోగ్రఫీ: కోరా చిన్నయ్య. జినేద్ర ఆర్ట్ డైరెక్టర్.
 
తారాగణం: సునామీ కిట్టి , చరిష్మా , పి.మూర్తి , M.K మాత , మునిరాజు , నినాసం అశ్వత్ తదితరులు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతి గారు, మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ అడుగుతా: ఐటిడిపి కిరణ్ (Video)

అప్పుడేమో వరినాటు.. ఇప్పుడు వరిని జల్లెడ పట్టిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ (video)

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments