అజ్ఞాతవాసిలో కీర్త‌న పెడితే వర్కవుట్ కాలేదు... మ‌రి 'అరవింద సమేత'లో...?

మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్... యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డం.. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం తెలిసిందే. ఇద

Webdunia
సోమవారం, 28 మే 2018 (19:05 IST)
మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్... యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌తో అర‌వింద స‌మేత అనే సినిమా చేస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేయ‌డం.. దీనికి అనూహ్య‌మైన స్పంద‌న రావ‌డం తెలిసిందే. ఇదిలా ఉంటే.. త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా అంటే... అందులో ఓ శాస్త్రీయ కీర్తన ఉంటుంది. సందర్భానికి తగ్గట్టుగా దాన్ని వాడుకుంటారాయన. 'అజ్ఞాతవాసి' చిత్రంలో "మధురాపురి సదనా మృదువదనా మధుసూదన ఇహ స్వాగతం కృష్ణా" అన్న పాట వినిపిస్తుంది. ఇక ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... అటువంటి కీర్తన ఏదీ తన తాజా చిత్రం అర‌వింద‌ సమేతలో ఉండదని స్పష్టం చేశారు.
 
'అజ్ఞాతవాసి'లో అటువంటి పాట పెడితే వర్కవుట్ కాలేదని గుర్తు చేస్తూ, అటువంటి పాట కొత్త సినిమా స్క్రిప్టులో లేదని చెప్పారు. అపజయాలు వచ్చినప్పుడు కుంగిపోయే వ్యక్తిని తాను కానని, విజయం సాధించినా, సినిమా పోయినా మామూలుగానే ఉంటానని చెప్పారు. అపజయం ఎదురైనప్పుడు మరింతగా పనిచేస్తే బయటపడవచ్చని, తానిప్పుడు అదే పని చేస్తున్నానని అన్నారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ నిర్మిస్తోన్న ఈ భారీ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ నెలలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్రోళ్ల వల్లే బెంగుళూరులో జనావాసం పెరిగిపోతోంది : ప్రియాంక్ ఖర్గే

ప్రజలు వేసిన ఒక్క ఓటు రాష్ట్ర భవిష్యత్‌నే మార్చివేసింది : పయ్యావు కేశవ్

బెంగళూరులో పట్టపగలు విద్యార్థినిని హత్య చేసిన యువకుడు

విజయవాడ: త్వరలో ఏఐతో పౌరులకు సేవలు అమలు.. మేయర్ రాయన

హైదరాబాద్ ఫామ్‌హౌస్‌లో రేవ్ పార్టీ.. నిందితుల్లో మాజీ మంత్రి సోదరుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

నిమ్మరసం ఎవరు తాగకూడదో తెలుసా?

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

తర్వాతి కథనం
Show comments