Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్‌గారి నట విశ్వరూపం చూస్తారు : త్రివిక్రమ్ (Full Video)

త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్‌తో భవ

Webdunia
బుధవారం, 20 డిశెంబరు 2017 (15:06 IST)
త్రివిక్రమ్ దర్శకత్వంలో హీరో పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ప్రీరిలీజ్ ఫంక్షన్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఇందులో దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ, పవన్ కల్యాణ్‌తో భవిష్యత్‌లో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ సినిమా గురించి చెప్పాలంటే తనకు గుర్తొచ్చే మాట ఎందరో 'మహానుభావులు' అని, ఈ సినిమా కోసం పని చేసిన వాళ్లందరూ చాలా గొప్ప వాళ్లని, ఏ ఒక్కరూ తక్కువ కాదని అన్నారు. ఈ చిత్రంలో పని చేసిన ప్రతి ఒక్కరి నుంచి తాను ఏదో ఒక విషయం నేర్చుకున్నానని, వాళ్లందరికీ తన ధన్యవాదాలని చెప్పారు. 
 
ఇలాంటి సినిమాను కోట్ల మందిలోకి ఒక్కసారిగా తీసుకెళ్లే సత్తా ఉన్నవారు పవన్‌. ఆయనకు రెండు నిమిషాల కథ ఫోన్‌లో చెప్పా. లైన్‌ బావుంది. ఈ సినిమా మనం చేస్తున్నాం అని ఫోన్‌ పెట్టేశారు. ఆరోజు నుంచీ నేటి వరకూ నేను ఏది చెబితే అదే చేశారు. అందుకే చెపుతున్నా.. ఈ చిత్రంలో కల్యాణ్‌గారి నట విశ్వరూపం చూస్తారు అని అన్నారు.
 
ఇకపోతే, 'సినిమా తప్ప మరొకటి తెలియని డిఓపి (డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ) మణికణ్ణన్‌గారి దగ్గర పని చేసి చాలా విషయాలు నేర్చుకున్నా. ఆర్ట్‌ డైరెక్టర్‌ అనిరుధ్‌తో 'అ ఆ'కు పనిచెయ్యాలనుకున్నా. మిస్‌ అయ్యా. మరో సినిమా తప్పకుండా చేద్దామని మాటిచ్చాడు. ఈ సినిమాకు పనిచేశాడు. భయం లేకపోవడం అనిరుధ్‌ నుంచీ నేర్చుకున్నా. బోమన్‌ ఇరానీ నా ఫేవరెట్‌ నటుడు. ఆయనలో నేను జెలసీ ఫీలయ్యే రైటర్‌ కూడా ఉన్నాడు. 
 
ఈ సినిమాకు కీలకమైన వ్యక్తి కుష్భూ. కథ చెప్పడం మొదలుపెట్టగానే 'నాకు అర్ధమైంది.. ఇంకేం చెప్నొద్దు. నేను చేస్తా నువ్వు వెళ్లిపో' అని చెప్పారు. ఆవిడ యాక్ట్‌ చేసిందే నేను షూట్‌ చేశా. రూపాయి అనుకుంటే రూపాయున్నర ఖర్చు చేసే రాధాకృష్ణగారు దొరకడం నా అదృష్టమని, ఈ చిత్రం ఖచ్చితంగా ప్రేక్షకుల మనసులను దోచుకుంటుందని దర్శకుడు త్రివిక్రమ్ జోస్యం చెప్పారు.
 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments