Webdunia - Bharat's app for daily news and videos

Install App

అనుష్క శర్మ పాత్రలో నాయకి హీరోయిన్ త్రిష.. రజనీకాంత్ టైటిల్ కొట్టేసింది..

బాలీవుడ్‌లో అనుష్క శర్మ నటించిన ఎన్‌హెచ్ 10 సినిమా బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కీలక పాత్రను తెల్లపిల్ల బాలీవుడ్ హీరోయిన్‌ అనుష్క శర్మ నటించింది. యంగ్‌ భార్యాభర్తలు విహారయాత్ర నిమిత్తం

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (15:38 IST)
బాలీవుడ్‌లో అనుష్క శర్మ నటించిన ఎన్‌హెచ్ 10 సినిమా బంపర్ హిట్టైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని కీలక పాత్రను తెల్లపిల్ల బాలీవుడ్ హీరోయిన్‌ అనుష్క శర్మ నటించింది. యంగ్‌ భార్యాభర్తలు విహారయాత్ర నిమిత్తం ట్రిప్‌కు వెళ్తారు. ఈ క్రమంలో భార్య(అనుష్కశర్మ) కొంతమంది క్రిమినల్స్‌ని హతమారుస్తుంది. ఈ కథాంశంతో గత ఏడాది విడుదలైన ఎన్‌హెచ్ 10 సినిమా మంచి విజయం సాధించింది. 
 
ప్రస్తుతం ఈ సినిమా తమిళంలో రీమేక్ కానుంది. కథానాయిక త్రిష ఈ రీమేక్‌లో అనుష్క శర్మ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి 'గర్జనై' అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. గతంలో ఇదే టైటిల్‌తో ఉన్న సినిమాలో సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటించారు. హిందీలో నవ్‌దప్ సింగ్ ఈ సినిమాను రూపొందించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కింది. 
 
ఇకపోతే.. త్రిష ప్రస్తుతం కొడి అనే పొలిటికల్ డ్రామాలోధనుష్ సరసన త్రిష నటించింది. ఈ సినిమా దీపావళికి రిలీజ్ కానుంది. ఇందులో త్రిష రాజకీయ నాయకుడిగా నటిస్తున్న ధనుష్‌తో త్రిష రొమాన్స్ చేస్తోంది. చెఫ్ మోహినిగా త్రిష కనిపించనుంది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

కార్తీక పౌర్ణమి రోజున గుండెపోటుతో 12 ఏళ్ల బాలిక మృతి.. ఎక్కడ?

ఆ శ్రీరెడ్డి, బోరుగడ్డ ఎవరసలు?: గుడివాడ అమర్నాథ్ ప్రశ్న (video)

విశాఖలో ఎన్టీపీసీ ఉత్పత్తి కేంద్రం.. 29న ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన

రక్త పింజర కాటేసింది.. పరుగెత్తి పట్టుకున్నాడు.. చంపి కవర్లో వేసుకుని?

చెన్నైలో రూ.3 కోట్ల విలువ చేసే ఏనుగు దంతాల బొమ్మలు స్వాధీనం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

ప్రపంచ మధుమేహ దినోత్సవం: రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడం కొన్ని బాదంపప్పులు తినండి

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments