బాలయ్య 101వ సినిమాలో హీరోయిన్‌గా త్రిష.. ఛార్మీతో ఐటమ్ సాంగ్..?!
గౌతమీపుత్ర శాతకర్ణికి సినిమాకు తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిషను నాయికగా తీసుకోనున్నట్లు సమాచారం. శాతకర్ణి సినిమాలో శ్రేయ నట
గౌతమీపుత్ర శాతకర్ణికి సినిమాకు తర్వాత దర్శకుడు పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో బాలయ్య కొత్త సినిమా సంతకం చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో త్రిషను నాయికగా తీసుకోనున్నట్లు సమాచారం. శాతకర్ణి సినిమాలో శ్రేయ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం బాలయ్య 101 సినిమాలో ఆమెనే ముందుగా తీసుకోవాలనుకున్నారు. కానీ ప్రస్తుతం త్రిషను పూరీ జగన్నాథ్ బాలయ్యతో రొమాన్స్ చేయించేందుకు రెడీ అయిపోయాడు.
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై వి.ఆనంద్ ప్రసాద్ నిర్మాతగా ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉండనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఒక కథానాయికగా ముస్కాన్‌ను తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండో హీరోయిన్‌గా 'త్రిష'ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు టాలీవుడ్ సమాచారం. ఇక మూడో కథానాయికగా 'ఛార్మీ'ని సెలక్ట్ చేస్తారని టాక్. కానీ ఈ సినిమాలో 'ఛార్మీ'తో ఐటమ్ సాంగ్ చేయిస్తారని మరో ప్రచారం జరుగుతోంది.