Webdunia - Bharat's app for daily news and videos

Install App

''96''కు పతకాల పంట.. త్రిష ఆనందానికి అవధుల్లేవ్..

Webdunia
గురువారం, 26 డిశెంబరు 2019 (18:51 IST)
కోలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా 96. విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ చిత్రం రికార్డుల పంట పండించింది. ముఖ్యంగా త్రిష ఖాతాలో పదికి మించిన అవార్డులు వచ్చి చేరాయి. ప్రేమ కథా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకుంది.

ఒకప్పటి అగ్ర హీరోయిన్ త్రిషకు కెరీర్ ముగిసిందనుకున్న వేళలో తమిళంలో తీసిన ‘96’ సినిమాతో త్రిష తనేంటో నిరూపించుకుంది. ఈ సినిమాలో అద్భుత నటనతో అదరగొట్టింది. ఇందులో భాగంగా ఈ సినిమాకుగాను త్రిషకు 11 అవార్డులొచ్చాయి. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 
 
96లోని జాను పాత్రకు ఇప్పటివరకు 11 అవార్డులు వచ్చాయంటూ అవార్డులతో దిగిన ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఇంకా తనకు వచ్చిన దీవెనలను కూడా లెక్కిస్తున్నానని తెలిపింది. ‘96’కు 11 అవార్డులు, హేజూడ్(మలయాళం) సినిమాకు 3 అవార్డులు.. మీ ప్రేమకు కృతజ్ఞతలు అని త్రిష ట్వీట్ చేసింది. గత ఏడాది అక్టోబర్ 4న విడుదలైన ‘96’ చిత్రం సంచలన విజయం సాధించింది. 
 
విజయ్ సేతుపతి, త్రిష నాయకా నాయికలుగా నటించగా, సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాను తెలుగులో కూడా రీమేక్ చేస్తున్నారు. ఇందులో శర్వానంద్, సమంతలు నాయకా నాయికలుగా నటిస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా వున్న సమంత 96లో త్రిషలాంటి డ్రెస్ కోడ్‌లో ఇటీవల శ్రీవారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. త్రిష తరహాలో సమంత కూడా అద్భుత నటనతో అవార్డులు గెలుచుకునే ఛాన్సుందంటూ ఇప్పటికే సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Loan app: ఆన్‌లైన్ లోన్ యాప్ వేధింపులు.. అశ్లీల, నగ్న చిత్రాలను షేర్ చేశారు.. చివరికి?

వోక్సెన్ యూనివర్శిటీ హాస్టల్‌లో ఉరేసుకున్న ఆర్కిటెక్చర్ విద్యార్థి.. కారణం?

Life: జీవితంలో ఇలాంటి ఛాన్స్ ఊరకే రాదు.. వస్తే మాత్రం వదిలిపెట్టకూడదు.. (video)

యువతిని కత్తితో బెదిరించి యేడాదిగా వృద్ధుడి అత్యాచారం...

చిన్నారి కళ్ళెదుటే ఉరివేసుకున్న వివాహిత.. భర్త, అత్తమామలపై కేసు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments