Webdunia - Bharat's app for daily news and videos

Install App

2022లో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదాలు

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2022 (13:18 IST)
Rameshbabu-krishma raju
ఈ ఏడాది 2022లో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాదాలు నెలకొన్నాయి. సీనియర్ నటులు, మా అసోసియేషన్ సభ్యులు కొందరు మరణం పొందారు. `మా` నటులు టివి.సుబ్బారావు, కేప్టిన్ చౌదరి, రాధయ్య పరమపదించారు. మరికొందరు సీనియర్ నటీ నటులు కొత్త మంది  అనారోగ్యంతో బాధపడుతున్నారు. కానీ మహేష్ బాబు కుటుంబంలో వరుస మరణాలు సంభవించడంతో తెలుగు సినిమా ఆశ్చర్య పోయింది. 
  
krishan-kaikala satynarayana
ఈ ఏడాది మొదట్లో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణం అందరిని కలిసి వేసింది. రమేష్ కొంతకాలముగా అనారోగ్యము తో బాధపడుతూ మరణించారు. అనంతరం మహేష్ బాబు తల్లి గారు ఇందిర కూడా మరణించారు. తాను పద్మాలయ నిర్మాణంలో సమర్పకురాలు.  కొద్ది రోజుల వ్యవధిలోనే రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించారు. ఎందరికో కామెర్లు రాకుండా పసరు మందు వేసి పేరుపొందిన కృష్ణంరాజు మరణం నర్సీపట్టణం చుట్టు పక్కల గ్రామాల ప్రజలను బాగా బాధించింది. సెప్టెంబర్ 11వ తేదీన కృష్ణంరాజు మరణించగా నవంబర్ లోనే సూపర్ స్టార్ కృష్ణ మరణించారు.
 
chalapatirao- subbarao
ఇలా కొన్ని వారాల వ్యవధిలోనే ఇద్దరు సూపర్ స్టార్ హీరోలు మరణించడం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.ఇక కృష్ణ మరణ వార్త మర్చిపోకముందే సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణించారు.ఈయన డిసెంబర్ 23వ తేదీ మరణించగా ఈయన మరణించిన రెండు రోజులకే చలపతిరావు మరణించారు. ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలో ఏడాది చివరిలో వరుస విషాదాలు చోటు చేసుకున్నాయి. కరోనా నుంచి గట్టెక్కిన సత్యనారాయణ చివరికి శ్వాస వ్యాధితో కాలం చేసారు. ఈ సందర్భంగా చిరంజీవి ఎంతో కలత చెంది కన్నీళ్లు పెట్టారు. అత్యంత తక్కువ సమయంలోనే ఇలా వరుసగా సినీ సెలబ్రిటీలు మరణించడం బాధాకరం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Andhra Pradesh: COVID-19 మార్గదర్శకాలను జారీ చేసిన ఏపీ సర్కారు

Chhattisgarh: బసవ రాజుతో సహా 27మంది మావోయిస్టులు మృతి

తిరుమలలో అపచారం: కొండపై నమాజ్ చేసిన వ్యక్తి - వీడియో వైరల్

Jio: ఆంధ్రప్రదేశ్ టెలికాం సర్కిల్‌లో జియో నెట్‌వర్క్‌ ఏర్పాటు

Drum Tower: 650 ఏళ్ల డ్రమ్ టవర్ కూలిపోయింది.. వీడియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments