Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపే RGV'S 'ఆశ ఎన్కౌంటర్', కోర్టుకెళ్లి మరీ విడుదల చేస్తున్నారు

Webdunia
శనివారం, 30 అక్టోబరు 2021 (17:59 IST)
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం కేసును ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఓ మూవీగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం రేపు విడుదల కాబోతోంది. ఈ చిత్రం వివాదాస్పదం కావడంతో పేరును ఆశ ఎన్ కౌంటర్‌గా మార్చి విడుదల చేస్తున్నారు.

 
కాగా దిశ కేసులో నలుగురు నిందితులు హైదరాబాద్ నగర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు. ఈ ఘటన ఆధారంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందించిన సినిమా 'ఆశ.. ఎన్‌కౌంటర్‌'‌. 

 
దిశను నలుగురు యువకులు ఎత్తుకెళ్లడం, అత్యాచారం చేయడం, ఆపై లారీలో తీసుకెళ్లి, ఓ వంతెన కింద పెట్రోల్ పోసి తగులబెట్టడం వంటి ఘటనలకు సంబంధించిన అంశాలు ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ఆపై విచారణ నిమిత్తం పోలీసులు రావడం వరకు వర్మ ట్రైలర్‌లో చూపించారు. 

 
ఈ సినిమాను నట్టి కరుణ సమర్పణలో అనురాగ్‌ కంచర్ల ప్రొడక్షన్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఆనంద్‌ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, హైదరాబాద్ నగరానికి చెందిన ఓ పశువైద్యురాలిని నలుగురు కామాంధులు దారుణంగా అత్యాచారం జరిపి, హత్య చేసిన విషయం తెల్సిందే. ఇది దేశంలో పెను సంచలనమైంది. ఈ ఘటన తర్వాత అత్యాచారాలకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించేందుకు దిశ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో కఠిన చట్టాలు వచ్చాయి. ముఖ్యంగా, ఏపీలో దిశ పేరుతో పోలీస్ స్టేషన్లు కూడా ప్రారంభించడం జరిగింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తాంత్రికుడి మాటలు నమ్మి బతికున్న కోడిపిల్లను మింగేశాడు..

దేశంలోనే అత్యంత ఆరోగ్యకరమైన గ్రామంగా బొమ్మసముద్రం

18న మార్చి నెల శ్రీవారి అర్జిత సేవా టిక్కెట్లు

అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం : ఐదుగురి మృతి

ఈ-కార్ రేస్‌కు నిధుల మళ్లింపు - ఏ క్షణమైనా కేటీఆర్ అరెస్టు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments