టాలీవుడ్ జేమ్స్‌బాండ్ సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు...

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (06:51 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తెలుగు సినీ దిగ్గజ హీరోల్లో ఒకరైన సూపర్ స్టార్ కృష్ణ ఇకలేరు. తీవ్ర అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో ఆదివారం అర్థరాత్రి చేరిన ఆయన మంగళవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఘట్టమనేని కుటుంబంలో మరో విషాదం నెలకొంది. 
 
గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇంట్లోనే ఉంటున్న కృష్ణ ఆదివారం రాత్రి 1.15 గంటల సమయంలో శ్వాసకోస సమస్యలతో బాధపడుతుండటంతో ఆస్పత్రికి తరలించారు. ఆ సమయంలోనే ఆయనకు గుండెపోటు వచ్చింది. దీంతో హుటాహటిన మహేష్ బాబు భార్య నమ్రత తమ మామ కృష్ణను కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆయనను పరిశీలించిన వైద్యులు ఎమర్జెన్సీ వార్డుకు తరలించి సీపీఆర్ పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత ఐసీయూకి తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. ఆ తర్వాత కృష్ణ ఆరోగ్యంపై వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మరో రెండు రోజులు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని స్పష్టత ఇచ్చారు. 
 
పైగా, శరీరంలో కూడా చలనం లేదని చెప్పారు. ముఖ్యంగా, కార్డియాక్ అరెస్టుతో పాటు శరీరంలోని అన్ని అవయవాలు పని చేయడం లేదని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ ఆయనకు 8 మంది వైద్యులతో కూడిన వైద్య బృందం చికిత్స అందిస్తూ, ఆయన ప్రాణాలు నిలబెట్టేందుకు శతవిధాలా ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఏవీ ఫలించకపోవడంతో మంగళవారం ఉదయం 6.15 గంటల సమయంలో ఆయన కన్నుమూసినట్టు వైద్యులు ప్రకటించారు. 
 
కాగా, ఘట్టమనేని కుటుంబంలో ఈ యేడాదిలో వరుసగా మరణాలు సంభవించాయి. ఇప్పటికే ఆ కుటుంబంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు అనారోగ్యంతో ఈ యేడాది జనవరిలో చనిపోయారు. నెలన్నర క్రితం కృష్ణ భార్య ఇందిరా దేవి వయసురీత్యా అనారోగ్యంతో కన్నుమూశారు. ఇపుడు కృష్ణ కూడా తీవ్ర అస్వస్థతకు గురై తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. కృష్ణ మృతిపై ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

9 డాలర్లు అంటే రూ.72 వేలా? ఇదేం లెక్క జగన్? ట్రోల్స్ స్టార్ట్

ప్రేమించిన వ్యక్తి మృతి చెందాడనీ మనస్తాపంతో ప్రియురాలు ఆత్మహత్య

Putin: ఢిల్లీలో ల్యాండ్ అయిన రష్యా అధ్యక్షుడు పుతిన్, స్వాగతం పలికిన ప్రధాని మోడి

Work From Village Policy: దేశంలోనే ఇది మొదటిసారి: బాబు, లోకేష్ సూపర్ ప్లాన్

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ - 18 మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

scrub typhus fever, విశాఖలో బెంబేలెత్తిస్తున్న స్క్రబ్ టైఫస్ పురుగు కాటు జ్వరం

ఈ 3 అలవాట్లు మధుమేహ ప్రమాదాన్ని నిరోధిస్తాయి

బియ్యం కడిగిన నీటిలో ధనియాలను మెత్తగా నూరి పటికబెల్లం కలిపి తింటే?

డయాబెటిస్ వ్యాధి వచ్చినవారు ఏమి చేయాలి?

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

తర్వాతి కథనం
Show comments