Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి పేరుతో పాఠశాల భవనం నిర్మించిన టాలీవుడ్ దర్శకుడు

Webdunia
సోమవారం, 2 ఆగస్టు 2021 (09:38 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో సుకుమార్ ఒకరు. ఈయన మంచి మనస్సున్న మనిషి కూడా. చిన్నప్పుడు తాను చదువుకున్న తూర్పుగోదావరి జిల్లా మట్టపర్రు ప్రాథమికోన్నత పాఠశాలలో తన తండ్రి తిరుపతినాయుడు పేరుతో రూ.18 లక్షలతో భవనం నిర్మించారు. రాజోలు ఎమ్మెల్యే రాపాక ప్రసాద్‌తో కలిసి సుకుమార్ దంపతులు ఆదివారం ఈ భవనాన్ని ప్రారంభించారు.
 
ఆ తర్వాత సుకుమార్ మాట్లాడుతూ, మట్టపర్రు గ్రామాభివృద్ధికి తానెప్పుడూ ముందుంటానని చెప్పారు. తన తండ్రి పేరుతో స్కూలు భవనం నిర్మించి, ప్రారంభించిన క్షణాలు మర్చిపోలేనివంటూ భావోద్వేగానికి గురయ్యారు. 
 
ఈ సందర్భంగా తాను చదువుకున్న తరగతి గదులను చూస్తూ నాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుకుమార్ ఆ పాఠశాలలో చదువుకున్నప్పటి రికార్డును ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ఫ్రేమ్ కట్టించి సుకుమార్‌కు అందజేశారు. 
 
తాను దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ సినిమా షూటింగ్ సెప్టెంబరులో తిరిగి ప్రారంభమవుతుందని సుకుమార్ తెలిపారు. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందులో అల్లు అర్జున్ నటిస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments