Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ - ఏఎన్నారు, మమ్ముట్టి - మోహన్‌ లాల్, ఇలా... ఎందరో హీరోలను మెప్పించిన..

Webdunia
శుక్రవారం, 21 మే 2021 (10:01 IST)
సీనియర్ హీరో శ్రీకాంత్ - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ సినిమా పెళ్లిసందడి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన వి.జయరాం కరోనా వైరస్ సోకి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలింది. చికిత్స తీసుకుంటూనే.. ప‌రిస్థితి విష‌మించి తుదిశ్వాస విడిచారు.
 
తెలుగులో విశ్వ‌విఖ్యాత న‌ట‌సార్వ‌భౌమ‌ నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వర రావు, కృష్ణ, చిరంజీవి, మోహన్ బాబు వంటి స్టార్ హీరోల చిత్రాల‌కు అలాగే మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్, సురేష్ గోపి లాంటి బ‌డా హీరోల సినిమాలకు ఈయన సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. 
 
ఇటు తెలుగు, అటు మలయాళం సినిమా రంగంలోనూ సినిమాటోగ్రాఫర్‌గా స‌త్తా చాటి… ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన అనేక చిత్రాల‌కు ఆయన సినిమాటోగ్రాఫర్‌గా వ‌ర్క్ చేశారు. 
 
బ్లాక్ బాస్ట‌ర్ ‘పెళ్లి సందడి’ చిత్రానికి కూడా ఆయ‌నే సినిమాటోగ్రాఫర్‌. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. జయరాం మరణవార్త తెలిసి పలువురు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

వైకాపాను ఖాళీ చేయడమే కూటమి లక్ష్యం : సోము వీర్రాజు

కుషాయిగూడలో చెత్తకుప్పలో పేలుడు.. కార్మికుడి మృతి (Video)

భార్యపై అనుమానం.. మూడున్నరేళ్ల బిడ్డను చంపేసిన టెక్కీ!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శరీరంలో చెడు కొవ్వును తగ్గించుకునే మార్గాలు ఏమిటి?

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments