Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు సినీ నటుడు - క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు..

Webdunia
సోమవారం, 25 అక్టోబరు 2021 (07:30 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాజబాబు ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన ఆదివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు వయసు 64 యేళ్లు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. 
 
రాజబాబు స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం మండలంలోని నరసాపురపేట. చినప్పటి నుంచే నటనపై ఆసక్తి పెంచుకున్న ఆయన నాటకాలు వేస్తూ దేశమంతా తిరిగారు.
 
1995లో ‘ఊరికి మొనగాడు’ సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. సింధూరం, సముద్రం, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, మురారి, భరత్ అనే నేను తదితర చిత్రాల్లో నటించారు. మొత్తంగా 62 సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. 
 
ముఖ్యంగా, రాజబాబు వసంత కోకిల, అభిషేకం, రాధా మధు, మనసు మమత, బంగారు కోడలు, బంగారు పంజరం, నా కోడలు బంగారం, చి ల సౌ స్రవంతి వంటి బుల్లితెర సీరియళ్లలోనూ నటించారు. అమ్మ సీరియల్‌లోని పాత్రకు 2005లో నంది అవార్డు కూడా అందుకుని బుల్లితెర ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు.. రేవంత్ రెడ్డి

అసెంబ్లీకి హాజరయ్యే ధైర్యం లేకుంటే జగన్ రాజీనామా చేయాలి: షర్మిల

పిజ్జా ఆర్డర్ చేస్తే.. అందులో పురుగులు కనిపించాయ్.. వీడియో

బాలినేనికి కేబినెట్‌లో స్థానం.. చంద్రబాబుకు తలనొప్పి.. పవన్ పట్టుబడితే?

సోషల్ మీడియాను దుర్వినియోగపరిచే వారికి ఎలాంటి శిక్షలు వున్నాయో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాగులుతో చేసిన పదార్థాలు ఎందుకు తినాలి?

బీట్ రూట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments