Webdunia - Bharat's app for daily news and videos

Install App

మరో సర్జికల్ స్ట్రైక్ కావాల్సిందే... ఉగ్ర‌ దాడిపై సినీ ప్రముఖుల ఆగ్ర‌హం

Webdunia
శనివారం, 16 ఫిబ్రవరి 2019 (11:55 IST)
కశ్మీర్‌లోని పుల్వామాలో గురువారం భద్రతా బలగాలపై ఉగ్రదాడి జరిగిన విష‌యం తెలిసిందే. ఈ దాడిలో 42 మంది జ‌వాన్లు వీర‌మ‌ర‌ణం పొందారు. ఈ దారుణంపై సినీ ప్ర‌ముఖులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ ట్విట్టర్లో... మరో సర్జికల్‌ స్ట్రయిక్‌ కావాలి. చంపి పడేయండి వారిని అంటూ త‌న‌దైన స్టైల్లో స్పందించ‌గా... ఇక మ‌హేష్ బాబు.. ఈ దాడి గురించి విని చాలా బాధ‌ప‌డ్డాను. చ‌నిపోయిన జ‌వాన్లు కుటుంబాల‌క సంతాపం తెలియ‌చేస్తూ... వారు ధైర్యంగా ఉండాల‌ని తెలియ‌చేసారు.
 
సీఆర్‌పీఎఫ్‌ జవాన్ల పట్ల ఇంత దారుణం జరిగిందని తెలిసి ఎంతో బాధపడ్డాను. వారి కుటుంబాలకు సంతాపం తెలియజేస్తున్నాను అంటూ హీరో సూర్య స్పందించారు. కశ్మీర్‌లో మన సీఆర్పీఎఫ్ జవానులకు జరిగిన దారుణ ఘటనను తెలుసుకుని షాక్ అయ్యాను. గుండె బరువుక్కుతోంది అలాగే కోపం వస్తోంది. ప్రేమికుల రోజుల మన హీరోలను కోల్పోయాం. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నాను అని నాని ట్వీట్ చేశాడు.
 
ఇక సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే మంచు మ‌నోజ్... మన వీరులకు ఎక్కడా రక్షణ లేదు. పుల్వామా దాడి చాలా బాధాకరం. ఇందుకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేస్తున్నాను అన్నారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి... మన జవాలను జీవితాలను హరించడం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తోంది. మన జాతి కోసం ప్రాణాలర్పించిన అమరుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ సాయి ధరమ్ ట్వీట్ చేసారు. ఇలా.. ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఈ దాడిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments