Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుటుంబాన్ని నమ్ముకుని సినిమాల్లోకి రావొద్దు.. దమ్ము వుండాలి: రేణు దేశాయ్

Webdunia
మంగళవారం, 23 జూన్ 2020 (15:40 IST)
సినీ ఇండస్ట్రీలో నెపోటిజం వుందనే అంశంపై ఇప్పటికే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. దీనిపై సినీ నటి, పవన్ మాజీ భార్య రేణు దేశాయ్ స్పందించారు. నెపోటిజం అన్ని రంగాల్లోనూ ఉంటుందని చెప్పారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడంపై రేణు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రంగంలోనైనా నెపోటిజం సహజమని.. నైపుణ్యాలు ఉండి ధైర్యంగా నిలబడగలిగితే దాన్ని జయించి విజయం సాధించొచ్చని తెలిపారు.
 
ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ హీరో సుశాంత్ చాలా సున్నితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తని రేణు అభిప్రాయపడ్డారు. సినిమాల్లో రాణించే నైపుణ్యత సుశాంత్‌కు వుంది కానీ.. అయితే, భావోద్వేగాలను బ్యాలెన్స్ చేసుకోలేకపోయాడేమోనని అన్నారు. 
 
అందుకే ఆయన కుంగుబాటుకు గురై ఉంటాడని రేణు దేశాయ్ చెప్పారు. కేవలం కుటుంబ నేపథ్యాన్ని నమ్ముకుని సినీ రంగంలోకి రావద్దని, నటులకు మనో ధైర్యం కూడా ఉండాలని ఆమె హితవు పలికారు. సినిమా రంగంలో మెరుగ్గా రాణించాలంటే మానసిక ధైర్యం కూడా అవసరమని చెప్పారు. సుశాంత్ సింగ్ మనోధైర్యం లేకపోవడం వల్లే సినిమాల్లో రాణించినా.. జీవితంలో ఎదగలేకపోయాడని చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments