మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగింది. హైదరాబాదులోని నాగబాబు నివాసంలో జరిగిన ఈ శుభకార్యానికి వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు విచ్చేశారు.
అంతరిక్షం అనే చిత్రంలో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి కలిసి నటించారు. ఐదేళ్ల పాటు వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వీళ్లిద్దరు తొలిసారి శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిస్టర్’ సినిమాలో కలిసి నటించారు. ఆ షూటింగ్ సమయంలోనే వీళ్లిద్దరు ఒకరంటే ఒకరు ఇష్టపడటం ప్రారంభమైంది. రెండు డిజాస్టర్స్ మూవీస్ వీరి ప్రేమను బ్లాక్ బస్టర్ చేసిందనే చెప్పాలి.