Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ అమెరికాలో జూలై 20న, ఇండియాలో జూలై 21న విడుదల

Webdunia
శనివారం, 15 జులై 2023 (18:21 IST)
Project K still
రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ల అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం 'ప్రాజెక్ట్ K' అనేక ఆకర్షణలతో ఇప్పటికే దేశవ్యాప్తంగా సందడి చేస్తోంది. ప్రాజెక్ట్ K అత్యంత ఖరీదైన ఇండియన్ సినిమా, ఇండియన్ సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో అలరించనున్నారు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, ప్రభాస్‌తో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు.
 
ప్రాజెక్ట్ K శాన్ డియాగో కామిక్-కాన్ 2023లో లాంచ్ అవుతున్న మొట్టమొదటి భారతీయ చిత్రం. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ K టైటిల్, గ్లింప్స్ అక్కడ జరిగే ఈవెంట్ లో భారత ప్రామాణిక కాలమానం( (IST) ప్రకారం జూలై 20న అమెరికాలో, జూలై 21న ఇండియాలో విడుదల కానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌ లు పిడికిలి షేక్ చేయడం కనిపిస్తోంది.
 
ఈ వేడుకకు ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనే, నాగ్ అశ్విన్, చిత్ర నిర్మాతలు హాజరుకానున్నారు.
 
'ప్రాజెక్ట్ K' వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న బహుభాషా సైన్స్ ఫిక్షన్ చిత్రం. ఈ చిత్రంతో సినిమా నిర్మాణ చరిత్రలో వైజయంతీ మూవీస్ సక్సెస్ ఫుల్ గా యాభై ఏళ్ళు పూర్తి చేసుకుంటుంది. చాలా మంది సూపర్‌స్టార్లు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేస్తున్న ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ ను దేశం ఎన్నడూ చూడలేదు.  
 
దర్శకుడు నాగ్ అశ్విన్ స్క్రిప్ట్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ప్రపంచ స్థాయి నిర్మాణ ప్రమాణాలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టెక్నికల్‌గా ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతోంది.
 
ప్రాజెక్ట్ K జనవరి 12, 2024న సంక్రాంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జమిలి ఎన్నికలపై చంద్రబాబు ఏమన్నారు..? 2029లోనే ఏపీ ఎన్నికలు?

మహారాష్ట్రలో నేడు కొలువుదీరనున్న మహాయుతి సర్కారు

భక్తజనకోటితో నిండిపోయిన శబరిమల క్షేత్రం... రూ.41 కోట్ల ఆదాయం

వైఎస్సార్‌సీపీది అత్యంత నీచమైన పాలన.. నారా లోకేష్ ఫైర్

మాజీ ప్రేమికుడి వేధింపులు.. 22 ఏళ్ల టీచర్ ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments