Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.28 కోట్లు పెట్టి చిత్రాన్ని తీస్తే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది...

ఠాగూర్
శుక్రవారం, 16 మే 2025 (14:38 IST)
మలయాళ అగ్రహీరో మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం 'తుడరుమ్'. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కించారు. ఈ చిత్రం నిర్మాణం కోసం కోవలం రూ.28 కోట్లు ఖర్చు చేశారు. విడుదలైన తర్వాత ఈ చిత్రం భారీ కలెక్షన్లను రాబడుతోంది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. 
 
సహజత్వానికి చాలా దగ్గరగా ఉండే ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూకడుతున్నారు. ఫలితంగా ఆ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఏప్రిల్ 24వ తేదీన విడుదలైన ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల చేశారు. మోహన్ లాల్ సరసన శోభన నటించారు. మిక్కీ జే మేయర్ సంగీతం. మోహన్ లాల్ కి గల క్రేజ్‌ గురించి, మార్కెట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయినప్పటికీ కథకు తగినట్టుగా ఖర్చు చేస్తూ కేవలం రూ.28 కోట్ల బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారు. 
 
అలాంటి ఈ సినిమా కేరళ రాష్ట్రంలోనే ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. మలయాళ ఇండస్ట్రీలో తక్కువ సమయంలో ఈ స్థాయిలో వసూళ్లను రాబట్టిన మూడో చిత్రంగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఆక్రమించింది. అలాంటి ఈ చిత్రం జూన్ నెలలో హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అందంగా అలంకరించి.. అంతమొదించారు.. ఓ కుటుంబం ఆత్మహత్య!

Snake On Plane: విమానంలో పాము-పట్టుకునేందుకు రెండు గంటలైంది.. తర్వాత?

బెంగళూరు ఇన్ఫోసిస్ రెస్ట్‌రూమ్ కెమెరా.. మహిళలను వీడియోలు తీసిన ఉద్యోగి

140 రోజుల పాటు జైలు నుంచి విడుదలైన వల్లభనేని వంశీ

చిల్లర రాజకీయాలతో పాదయాత్ర అంటూ వస్తే చెప్పుతో కొడతారు : బైరెడ్డి శబరి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

ఆవు నెయ్యి అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

గుండెపోటు సంకేతాలు నెల ముందే కనిపిస్తాయా?

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

తర్వాతి కథనం
Show comments